మహిళ అంటే అమ్మతనానికి పెట్టింది పేరు. ప్రతీ మహిళ కూడా అమ్మలాగే ఆలోచిస్తుంటుంది అని అంతా అనుకుంటుంటారు కానీ.. అమ్మ వేరు ఆడది వేరు ఈమె వేరు అనే సంకేతాలు ఇచ్చే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిత్యం చూసే సీరియల్స్ ప్రభావమో లేక అప్పుడప్పుడూ చూసే సినిమాల ప్రభావమో కానీ.. తాజాగా ఒక మహిళ తనకు కొడుకులు లేరన్న అసూయతో.. మరదలికి పుట్టిన కొడుకు (ఈమెకు మేనల్లుడు)ని ఆస్పత్రి పై నుంచి కిందకు విసిరేసింది. కేవలం 18 రోజుల ఆ పిల్లాడిపై మేనత్తే ఇలాంటి ఆలోచన పెంచుకుంది.. ప్రస్తుతం ఆ పిల్లాడి పరిస్థితి విషమంగా ఉంది.
అన్మోల్ అనే ఆ పసివాడికి రక్తప్రసరణకు సంబంధించిన సమస్య రావడంతో కొన్నాళ్ల క్రితం అతడిని శ్యామ్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత కాస్త అత్యవసరమైన పని ఉండటంతో ఆ పిల్లవాడి తల్లిదండ్రులు సర్వేష్ కుమార్ - అల్కా లు తమ స్వగ్రామానికి వెళ్తూ, ఆస్పత్రిలో ఉన్న ఆ పిల్లాడి బాధ్యతను మేనత్త సరితాదేవికి అప్పగించారు. ఈ సమయంలో తన ఆడపడుచు పై ఉన్న అక్కసును మేనల్లుడిపై చూపించిన సరితాదేవి.. ఆ కుర్రాడిని ఆస్పత్రి భవనం పైనుంచి కిందకు విసిరేసింది.
అయితే మరుసటిరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో నర్సులను హడావిడిగా పిలిచిన సరితాదేవి.. పిల్లాడు కనిపించడం లేదని చెప్పింది. దీంతో కంగారుపడిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు వచ్చి గాలించగా, ఆస్పత్రికి పక్కనే ఉన్న మరో బ్లాకు నుంచి పిల్లవాడి ఏడుపు వినిపించింది. వెంటనే ఆ ఏడుపును గుర్తించిన పోలీసులు ఓ ఇనుప గ్రిల్ లో ఇరుక్కుని ఆ పిల్లవాడిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం పరిశీలించిన వైద్యులు ఆ పిల్లాడికి బాగా గాయాలు అయ్యాయని, ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పారు.
అయితే విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజి చూస్తే.. ఆ పిల్లాడి మేనత్త సరితాదేవి స్వయంగా ఓ టవల్ లో ఆ పిల్లాడిని చుట్టి బయటకు విసిరేసినట్లు కనిపించింది. తమదైన శైలిలో ప్రశ్నించిన పోలీసులకు తర్వాత జరిగినదంతా చెప్పి నేరాన్ని అంగీకరించింది. అయితే ప్రస్తుతం పిల్లాడి పరిస్థితి విషమంగా ఉండగా.. సరితాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, సరితాదేవికి ముగ్గురు కూతుళ్లున్నారు. అయితే కొడుకులు మాత్రం లేరు.
Full View