ఒకరేమో ఉగ్రవాదికి ఉరిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి రాజ ద్రోహం కింద కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి. మరొకరేమో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చిన ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా తెలంగాణ ఏసీబీ కేసులు నమోదు చేసిన వ్యక్తి. ఆ ఇద్దరూ కలిశారు! మొదటి వ్యక్తి భుజం తట్టేందుకు రెండో వ్యక్తి ఏకంగా హైదరాబాదు నుంచి ఢిల్లీకి వెళ్లారు. వారే ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్ యూ) స్టూడెంట్ లీడర్ కన్నయ్య కుమార్ - అఖిల భారత దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి జెరూసలెం మత్తయ్య. హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్లిన మత్తయ్య జేఎన్ యూకు వెళ్లి కన్నయ్యకు మద్దతు పలికారు.
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని హాస్టల్ లో కన్హయ్యను కలుసుకుని తమ సంఘీభావం తెలిపిన సందర్భంగా జెరుసలేం మత్తయ్య ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మతతత్వ శక్తుల కుట్రలను భగ్నంచేసి... జాతీయవాది - దేశభక్తుడు అనిపించుకున్న వ్యక్తి కన్హయ్య అని కొనియాడారు. త్వరలో దేశంలోని అన్ని విశ్వ విద్యాలయాలను సందర్శించనున్న కన్హయ్య బృందాన్ని తెలుగు రాష్ట్రాలలో పర్యటించి విద్యార్ధులను చైతన్యపరచాలని మత్తయ్య ఆహ్వానించారు. ఓటుకు నోటు కేసులో విచారణ సందర్భంగా తనకు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్తున్న మత్తయ్య ఏకంగా ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి హోదాలో ఢిల్లీ వెళ్లి మరీ కన్హయ్యకు మద్దతివ్వడం ఇపుడు ఆసక్తికరంగా మారింది.