ఎగురుతున్న విమానంలో పుట్టిన కుర్రాడు.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు. విమానంలో ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. దీంతో.. ఆ బుడ్డోడికి సదరు విమానయాన సంస్థ ఊహంచని సర్ ప్రైజ్ ఇచ్చేసి.. బంపర్ ఆఫర్ ను సొంతం చేసుకున్నారు. పుడుతూనే అదృష్టాన్ని అరచేతిలో పెట్టకొని పుట్టినట్లుగా మారాడు. ఈ ఆసక్తికర ఉదంతంలోకి వెళితే..
జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9డబ్ల్యూ 569 విమానం ఒకటి ఆదివారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి భారత్ లోని కొచ్చి ఎయిర్ పోర్ట్ కు బయలుదేరింది. ఈ విమానంలో ఒక గర్భిణి ప్రయాణిస్తున్నారు. భూమికి 35 వేల అడుగుల ఎత్తులో ఉన్న వేళ.. సదరు గర్భిణికి నొప్పులు మొదలయ్యాయి. దీంతో.. విమానంలో ప్రయాణిస్తున్న కేరళకు చెందిన ఒక నర్సు సాయంగా నిలిచారు. విమాన సిబ్బందిసాయంతో ఆమెకు కాన్పు చేశారు.
పండంటి బిడ్డకు సదరు ప్రయాణికురాలు జన్మనిచ్చింది. దీంతో.. విమానాన్ని అత్యవసరంగా ముంబయికి మళ్లించారు. ల్యాండ్ అయిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 90 నిమిషాల ఆలస్యంతో విమానం మళ్లీ తన గమ్యస్థానం దిశగా బయలుదేరింది. ఇదిలాఉండగా.. తమ విమానాల్లో ఒక శిశువు జన్మించటం ఇదే తొలిసారిగా జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. ఇందులో భాగంగా తమ విమానంలో పుట్టిన బుడ్డోడికి జీవితాంతం టిక్కెట్లు ఉచితంగా ఇవ్వాలని జెట్ ఎయిర్ వేస్ నిర్ణయించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/