పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ నటుడు జానీ డెప్ వ్యక్తిగత జీవితంలో కల్లోలం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. భార్య అంబర్ హర్ట్ తో అతడి బ్రేకప్ పరువునష్టం దావా వగైరా చర్చనీయాంశంగా మారాయి.
హాలీవుడ్ స్టార్స్ జానీ డెప్ - అతని మాజీ భార్య అంబర్ హర్డ్ మధ్య జరుగుతున్న పరువు నష్టం దావా విచారణ సంచలనంగా మారింది. ప్రపంచ కుభేరుడితో తన భార్య ఎఫైర్ వ్యవహారం గురించి జానీ డెప్ బహిరంగంగా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కుభేరుడు ఎలన్ మస్క్ గురించి జానీ డెప్ అన్న మాటలు హీటెక్కిస్తున్నాయి.
జానీ డెప్ తన మాజీ టాలెంట్ ఏజెంట్ క్రిస్టియన్ కారినోకు పంపిన మెసేజుల్లో అతను అంబర్ హర్డ్ - టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ మధ్య రహస్య సంభాషణల వ్యవహారం గురించి మాట్లాడాడు. టెక్స్ట్ లలో "నన్ను ముఖాముఖిగా చూసేందుకు రండి... ఇంతకు ముందెన్నడూ చూడని వాటిని నేను చూపిస్తాను..." అని ఉంది.
అంబర్ హర్డ్ పై నాసిరకం ఆడది అని పనికిరానిది అని డాంగ్లింగ్ ఓవర్ యూజ్డ్ ఫ్లాపీ ఫిష్ అని డెప్ తీవ్ర పదజాలం ఉపయోగించాడు. వేరొక మెసేజ్ లో "కర్మ నుండి ఆమె బహుమతిని తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను" అని అన్నారు.
తన పరువుకు నష్టం వాటిల్లినందున అంబర్ హర్డ్ నుండి 50 మిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని కోరుతున్నానని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో రాసాడు. దీనిలో ఆమె తనను తాను 'గృహ దుర్వినియోగానికి ప్రాతినిధ్యం వహించే పబ్లిక్ ఫిగర్'గా అభివర్ణించింది అని అన్నాడు.
జానీ డెప్ తన తాజా వాంగ్మూలంలో మాట్లాడుతూ.. గృహహింసకు సంబంధించి ఆమె చేసిన హీనమైన ఆరోపణలను వినడం "ఊహించలేనంత క్రూరమైనవి" అని "ఏ మానవుడూ పరిపూర్ణుడు కాదు" అని రాసాడు. మనలో ఎవరూ అతీతులం కాదు. కానీ నేను నా జీవితంలో ఎప్పుడూ లైంగిక వేధింపులకు .. శారీరక వేధింపులకు పాల్పడలేదు అని చెప్పాడు. జానీ డెప్ గొప్ప నటుడు.. సంపాదకుడు.. కానీ ఇప్పుడిలా భార్యతో వివాదంలో తీవ్ర మనోవ్యధను అనుభవిస్తున్నాడు.