తెలంగాణలోని అధికార టీఆర్ ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలకు తెర పడినట్లేనా? ఇప్పటికే కారెక్కిన నేతల దుస్థితి చూసిన ఇతర పార్టీల నాయకులు కాకిలా కలకాలం ఉండే కంటే హంసలా ఆరు నెలలు బతికితే చాలనే ధోరణికి వస్తున్నారా? ఇందుకు ఇప్పటికే టీఆర్ ఎస్ లోకి వెళ్లిన నేతల దుస్థితే కారణమా? ఈ ప్రశ్నలకు ఔను అనే జవాబిస్తున్నాయి ప్రతిపక్షాలు.
కాంగ్రెస్ - టీడీపీ - వైసీపీల నుంచి కారులోకి ఎంతోమంది నాయకులు వెళ్లిపోయారు. కేసీఆర్ ఆకర్ష్ కు చిక్కకున్న వాళ్లు కొంతమంది అయితే.. ఆయన బెదిరింపులకు తలొగ్గిన వాళ్లు కొందరు. అధికార పార్టీలో అవకాశాలు కుప్పలు తెప్పలుగా ఉంటాయని ఆశించి వెళ్లిన వాళ్లు మరికొందరు. అధికార పార్టీలో ఉంటే సంపాదించుకోవచ్చని వెళ్లిన వాళ్లు ఇంకొందరు. అయితే, బంగారు తెలంగాణ బ్యాచ్ కు మినహా అది కూడా... కేసీఆర్ కు గతంలో అత్యంత సన్నిహితులైన అతి కొద్ది మంది మినహా మిగిలిన నాయకుల పరిస్థితి టీఆర్ ఎస్ లో ఏమాత్రం బాగా లేదు. మిగిలిన పార్టీల్లో ఉన్నప్పుడు కనీసం తాము జీవించి ఉన్నామన్న స్పృహలో ఉండేవాళ్లమని, తమ గొంతు ఎక్కడో అక్కడ వినిపించేదని, కానీ ఇప్పుడు మేం జీవించే ఉన్నామా అని మాకే సందేహం వస్తోందని ఆకర్ష్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికార పార్టీలోకి వచ్చినా.. పదవులు లేవు. సంపాదించుకోవడానికి అవకాశం లేదు. ఆ కుటుంబం తప్పితే మిగిలిన వాళ్లు సంపాదించుకోవడానికి లేదు. కనీసం ప్రభుత్వం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కూడా లేవు. కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో బతుకుతున్నామని టీఆర్ ఎస్ లోని ఆకర్ష్ ఎమ్మెల్యేలు తమ సహచరుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పటికీ కారు ఎక్కాలని భావిస్తున్న నేతలంతా వెనక్కి తగ్గుతున్నారని అధికార పార్టీ నాయకులే చెబుతున్నారు.