బాబు ఫ్లాష్ బ్యాక్ ఇదీ... కాక రేపిన కాకాణి

Update: 2022-09-08 13:03 GMT
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇపుడున్న రాజకీయ నాయకులు అందరి కంటే సీనియర్ మోస్ట్. ఇక వయసు పరంగా కూడా బాబు చాలా పెద్దవారు. ముమ్మారు సీఎం చేశారు. జాతీయ రాజకీయాలలో ఒక వెలుగు వెలిగారు. చాన్స్ దొరికితే మళ్ళీ ఏపీ సీఎం తో పాటు దేశంలో చక్రం తిప్పే సత్తా టాలెంట్ తనకు ఉన్నాయని బాబు ధీమా చేస్తారు. అలాంటి బాబు తన రాజకీయ జీవితం మొత్తం మీద వినకూడని విమర్శలు ప్రత్యర్ధి పార్టీ నుంచి వింటున్నారు.

చిత్రమేంటి అంటే అర్ధ శతాబ్దానికి బాబు రాజకీయానికి అంత వయసు కూడా  లేని నాయకులు చేస్తున్న విమర్శలు తట్టుకోవడం కూడా  కష్టమే. బాబుని రాజకీయంగా విమర్శించడం ఒక ఎత్తు. ఆయన ఫ్లాష్ బ్యాక్ ని తవ్వి ఇవీ నిజాలు అంటూంటే అవునో కాదో చెప్పడానికి ఆనాటి  తరం లేదు, సమకాలీకులు కూడా ఇపుడు రాజకీయాన లేరు. ఇక ఇపుడు విమర్శలు చేస్తున వారు కూడా నాడు పుట్టి ఉండరు. మొత్తానికి ఇవి రాజకీయ విమర్శలను మించి ఉన్నాయనే అన్న భావన వ్యక్తం అవుతోంది

వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి చంద్రబాబు ఫ్లాష్ బ్యాక్ ని ఉన్నట్లుండి గుట్టు ఇదని  విప్పారు. బాబు చదువుకునే రోజులలోకి వెళ్లారు. అంటే ఇప్పటికి కచ్చితంగా యాభై ఏళ్ళ పై మాటే అనుకోవాలి. నాడు బాబు ఒక చేపలమ్ముకునే అమ్మాయిని మోసం చేశారని, ఆ అమ్మాయి పెట్టే డబ్బులతో చదువుకుని ఆనక ఎన్టీయార్ కూతురుని పెళ్ళి చేసుకుని ఆ మీదట మామ పార్టీని, ముఖ్యమంత్రి సీటుని కూడా కొట్టేసారని కాకాణి ఘాటైన కామెంట్స్ చేశారు.

ఇక చంద్రబాబు తండ్రి ఖర్జూరం నాయుడు అందరూ రాత్రి నిద్రపోయే టైమ్ లో పక్క వారి పొలాల్లోకి వెళ్ళి వేరుశనగ బస్తాలను దొంగించేవారని కూడా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు బాబు ఆస్తి ఎంత, ఇపుడు ఎంత అన్న  వివరాలు చెప్పగలరా అని నిలదీశారు. బాబుది నీచమైన చరిత్ర అని, అలాంటి వారు ఏపీలో పుట్టడమే ఈ రాష్ట్రం చేసుకున్న పాపమని కూడా కాకాణి చెడా మడా అనేశారు.

ఇవన్నీ ఆరోపణలు విమర్శలు. అయితే ఇందులో బాబు గతానికి వెళ్ళి తవ్వి మరీ తీసిన విషయాలు కూడా ఉన్నాయి. మరి బాబు వీటిని జవాబు చెప్పాలని అవునా కాదా చెప్పాలని మంత్రి గారు అంటున్నారు. బాబు వయసు ఇపుడు ఏడున్నర పదులకు చేరువలో ఉంది. ఆయన చదువుకునే రోజులు అంటే పాతికేళ్ళ లోపు ఉంటాయి. అపుడెపుడో ఆయన ఒక అమ్మాయిని మోసం చేశారని ఇన్నేళ్ళ తరువాత కాకాణి చెప్పడమే ఒక సెన్సేషన్

అయితే బాబు రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ని గట్టిగానే ఎదుర్కొన్నారు. ఇక ఆయనకు ఒకనాటి మిత్రుడు, తరువాత ప్రత్యర్ధిగా ఉన్న వైఎస్సార్ కి బాబు గురించి పూర్తిగా తెలిసే ఉంటుంది. మరి ఆయన కానీ నాటి కాంగ్రెస్ పెద్దలు కానీ  చేయని ఆరోపణలు ఇపుడు వైసీపీ వారు చేస్తున్నారు అంటే ఎక్కడో  విన్న విషయాలు చెబుతున్నారా లేక అంటా అనుకుంటా అన్న భోగట్టాలు తెచ్చి మరీ చెబుతున్నారా అన్నదే అర్ధం కావడం లేదు అంటున్నారు. ఏది ఏమైనా గతం లో జరిగిందో లేదో తెలియని విషయాలను పట్టుకుని నానా యాగీ చేయడం కంటే ప్రస్తుత విషయాల మీద  రాజకీయంగా విమర్శలు చేస్తే బెటర్ కదా అన్న మాట అయితే ఉంది మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News