ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య వెర్బల్ వార్ తీవ్రస్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో జనసేన తరఫున తన వాణిని వినిపించిన కల్యాణ్ దిలీప్ సుంకర...పవన్ ఫ్యాన్స్ కు, జనసేన కార్యకర్తలకు పరిచయస్థుడే. కత్తి మహేష్ తో పాటు పలు లైవ్ డిబేట్ లలో కల్యాణ్ పాల్గొన్నారు. కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య రాజీ కుదిరిన ఎపిసోడ్ లో, పోలీస్ స్టేషన్ లో కేసు వాపస్ తీసుకునే సందర్భంలో కూడా కల్యాణ్ కీలకమైన పాత్ర పోషించారన్నది వాస్తవం. గత నాలుగేళ్లుగా జనసేనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఎదుర్కోవడంలో కూడా కల్యాణ్ యాక్టివ్ రోల్ ప్లే చేశారు. అయితే, తాజాగా, జనసేనకు గుడ్ బై చెబుతూ కల్యాణ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన పోస్ట్ సంచలనం రేపింది.
పార్టీ ఆఫీస్ కు చెందిన కొందరు వ్యక్తులు తనకూ పార్టీకి సంబంధం లేదని పదే పదే చెప్పడం, తనను బాధించిందని కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కత్తి మహేష్ ని తానే రెచ్చగొట్టి....కాంప్రమైజ్ చేశానని, టిడిపి నుంచి డబ్బు తీసుకున్నానని కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కల్యాణ్ మండిపడ్డారు. నాలుగేళ్లుగా సొంత డబ్బుతో చాలా కార్యక్రమాలు చేశానని, పవన్ పిలుపు రాకపోగా తన గురించి ఆయనకు చెడుగా ప్రచారం చేశారని అన్నారు. తనకు, జనసేనకు సంబంధం లేదని మీడియా హెడ్.. చెబుతున్నారని, ఆ విషయంపై ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే జన్మలో జనసేన మొహం కూడా చూడనని అన్నారు. ఆ ప్రెస్ నోట్ ఇచ్చి తనను ఆ మానసిక వ్యధ నుండి తప్పించాలని కోరారు.
వాస్తవానికి కల్యాణ్ కు జనసేనకు సంబంధం లేదని గతంలో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు వచ్చాయి. అయితే, అధికారికంగా జనసేన తరపు నుంచి ఎవరూ ఆ విషయాన్ని వెల్లడించలేదు. అయితే, అదే సమయంలో కల్యాణ్ ను జనసేన ప్రతినిధిగా కూడా ఎవరూ నియమించలేదు. దీంతో, ఆ పుకార్లను పట్టించుకోని కల్యాణ్....జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ పార్టీ తరపున ప్రతినిధులెవరూ లేని సమయంలో సొంత ఖర్చులతో చాలా లైవ్ డిబేట్లలో జనసేన తరపున మాట్లాడారు. జనసేన తరపున వేరెవరూ ముందుకు రాని సమయంలో ఆయన స్పందించారు. మంచి వక్త అయిన కల్యాణ్ వాగ్ధాటిని పలువురు ప్రశంసించారు. అయితే, అటువంటి వ్యక్తి గురించి పవన్ నిజానిజాలు తెలుసుకొని పార్టీలో స్థానం కల్పించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. పవన్ సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే కల్యాణ్ వంటి అసలు సిసలు కార్యకర్తలు జనసేనకు దూరమైపోతున్నారని, ఆయన చుట్టు ఉన్న కోటరీ పవన్ ను తప్పుదోవ పట్టిస్తోందని నెటిజన్లు అంటున్నారు. పవన్ విధానాల వల్లే ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయని, ఇలాగే కొనసాగితే జనసేన...మరో ప్రజారాజ్యం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.