రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం అసాధ్యం. పార్టీల మాట ఎలా ఉన్నా ఆయా పార్టీల నేతలు ప్రత్యేకించి అధినేతల వ్యవహార సరళిని ఊహించడం దాదాపుగా అసాధ్యం. ఈ మాట నిజమేనంటూ ఇప్పుడు తమిళనాట జరిగిన ఓ ఘటన రుజువు చేస్తోంది. నిత్యం కత్తులు దూసుకుంటున్న డీఎంకే, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతలు ఎంకే స్టాలిన్, కమల్ హాసన్ లు పరస్పరం అభివాదం చేసుకోవడంతో పాటుగా చాలా సేపు పక్కపక్కనే కూర్చుని మీడియాకే షాకిచ్చారు. నటుడిగా తమిళనాడులోనే కాకుండా యావత్తు భారతావనిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమల్ హాసన్ ఇటీవలే మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి.. పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిపోయారు.
మొన్నటిదాకా దాదాపుగా అన్ని పార్టీలపైనా తనదైన శైలి సెటైర్లు వేస్తున్న కమల్.... నిన్నటికి నిన్న డీఎంకేను నేరుగానే టార్గెట్ చేశారు. డీఎంకే అవినీతి పార్టీ అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట పొలిటికల్ హీట్ కు తెర లేపాయి. కమల్ వ్యాఖ్యలపైనా వెనువెంటనే స్పందించిన డీఎంకే... కమల్ తీరుపై నిప్పులు చెరిగింది. తన అధికార పత్రిక మురసోలి లో ఏకంగా ఓ భారీ కథనాన్ని ప్రచురించిన డీఎంకే... కమల్ బీజేపీకి అమ్ముడుబోయారని ఆయనపై నేరుగానే మాటల తూటాలను పేల్చేసింది. ఈ రెండు విషయాలపై తమిళనాట పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుండగానే... డీఎంకే చీఫ్ స్టాలిన్, కమల్ ఒకే వేదిక పైన కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
చెన్నైలోని తిరువాన్మియూర్ లో డీఎంకే ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ఇంటిలో జరిగిన వివాహ కార్యక్రమంలో స్టాలిన్, కమల్ హాసన్, కేంద్రమంత్రి పొన్.రాధాకృష్ణన్ లు పాల్గొని ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. అదే సమయంలో స్టాలిన్, కమల్ పక్క పక్క సీట్లలో ఆశీనులయ్యారు. అలా చాలా సేపే కూర్చున్న ఇద్దరు నేతలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇలా బయట తిట్టిపోసుకుంటున్న నేతలు... ప్రత్యక్షంగా కలిస్తే మాత్రం ఆ విభేదాలన్నింటినీ మరిచిపోయి చేతులు కలుపుకుంటూ పక్కపక్కనే కూర్చోవడం ఇప్పుడు పెద్ద చర్చగానే మారిపోయింది. అంతే మరి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గానీ, శాశ్వత మిత్రులు గానీ ఉండరు కదా.