ఇక మీదట కన్యాకుమారి కాదు.. ‘కన్నియ కుమారి’

Update: 2016-05-13 06:51 GMT
అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకూ అంటూ తరచు మాట్లాడేవారంతా కాస్త అలెర్ట్ కావాల్సిన అవసరం ఉంది. దేశానికి ఆ చివర.. ఈ చివరల గురించి చెబుతూ.. కాశ్మీర్ గురించి..కన్యాకుమారి గురించి ప్రస్తావించటం తెలిసిందే. అయితే.. కన్యాకుమారి పేరు మారనుంది. ఈ ఊరి పేరును మారుస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా ఈ ఊరికి ‘‘కన్నియ కుమారి’’ అంటూ మారుస్తూ అధికారిక నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి కన్యాకుమారి అసలుపేరు కన్నియ కుమారి. అయితే.. బ్రిటీషోళ్లకు నోరు తిరగక పోవటం.. పలికేందుకు కష్టంగా ఉండటంతో దీన్ని కన్యాకుమారిగా మార్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాజాగా కన్యాకుమారి పేరును మార్చటానికి ముందు నుంచే రైల్వే స్టేషన్ పేరు మాత్రం కన్నియ కుమారిగా ఉండటం గమనార్హం. కన్యాకుమారికి పాతపేరునే పెట్టాలంటూ రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది.

అయితే.. ఆ విషయంపై నిర్ణయం తీసుకోకపోవటంతో ఆ ఇష్యూ అలానే పెండింగ్ లో ఉంది. తాజాగా పేరు మారుస్తూ గెజిట్ వెలువడటంతో.. కన్యాకుమారి కాస్తా కన్నియ కుమారిగా మారిపోయింది. దీనికి తగ్గట్లే పరిపాలన సంబంధిత వెబ్ సైట్లు.. అధికారిక కార్యాలయాలు అన్నింట్లోనూ ‘కన్నియ కుమారి’గా మార్చేశారు. సో.. కన్యాకుమారి అనే బదులు కన్నియ కుమారి అని పలకాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకండి.
Tags:    

Similar News