కల్వకుంట్ల కవిత.. అందరిలా ఆమె తండ్రి చాటు బిడ్డ కాదు. కేవలం వారసత్వాన్నే నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. తన వాక్పటిమతో అందరి మనసుల్ని గెల్చుకున్నారు. నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించి సత్తా చాటారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కొన్ని నియోజకవర్గాల బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు కవిత. ముఖ్యంగా జగిత్యాలలో టీఆర్ ఎస్ ను గెలిపించడం ద్వారా తన తండ్రికి గిఫ్ట్ ఇచ్చారామె. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే ఆమెకు తాజాగా కాస్త విరామం దొరికింది. తండ్రి - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో చేస్తున్న రాజశ్యామల యాగానికి హాజరయ్యారు.
ఈ యాగంతో కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఒక్కచోటకు చేరారు. కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, కవిత దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ ఇలా అందరూ అక్కడికి విచ్చేశారు. భక్తితో పూజలు చేశారు. ఆపై కాసేపే సరదాగా గడిపారు. ముఖ్యంగా కవిత యాగం వద్ద చాలా ఉల్లాసంగా - ఉత్సాహంగా కనిపించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఆమె.. తన భర్త, సోదరుడు, వదినలతో కలిసి దిగిన ఫొటోలను వాటిలో పంచుకున్నారు. యాగం కారణంగా రాజకీయాల నుంచి దొరికిన కాస్త విరామాన్ని బాగా ఆస్వాదించినట్లు తెలిపారు.
Full View