వాళ్లిద్దరూ ప్రత్యర్థులు.. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ప్రసంగం మొదలుపెడితే చాలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుగా తిట్టేది కేసీఆర్ నే.. అలాంటిది ఒకవేదికపై కేసీఆర్ కూతురు కవిత, బండి సంజయ్ తారసపడ్డారు. అదిప్పుడు వైరల్ గా మారింది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే వేదికపై కూర్చున్న దృశ్యం ఫోకస్ అయ్యింది. గవర్నర్ దత్తాత్రేయ ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా జలవిహార్ లో ‘అలాయ్ బలాయ్’ నిర్వహిస్తుంటారు. దీనికి రాజకీయాలు పక్కనపెట్టి అందరూ వస్తారు. ఆప్యాయంగా పలకరించుకుంటారు.
ఈ క్రమంలోనే దీనికి పవన్ కళ్యాణ్, మంచు విష్ణుతోపాటు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం హాజరయ్యారు. వీరిద్దరూ ఒకేవేదికపై పక్కపక్కనే కూర్చుకోవడం వివేషం. అన్ని పార్టీల వారిని పిలిచి నిజమైన దసరా స్ఫూర్తిని చాటారు. తెలంగాణకు ప్రజలకు బండారు దత్తాత్రేయ మరోసారి ఈ మంచి సంప్రదాయాన్ని గుర్తు చేశారని కవిత కొనియాడారు.
ఇక ఇదే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కలివిడిగా పాల్గొని అలరించారు.
కవిత, బండి సంజయ్ పక్క పక్కనే కూర్చొని కాసేపు మాట్లాడుకోవడం సభకు వచ్చిన వారిని ఆకర్షించింది.