గడిచిన 2014 ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ మొత్తం టీఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కరీంనగర్ జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో `12 నియోజకవర్గాల్లో గెలిచింది. కానీ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ శాసన సభ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి ధాటికి ఓడిపోయింది. ఈ జగిత్యాల ఎంపీ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ జగిత్యాల ఉంది. దీంతో ఈసారి ఎలాగైనా జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఓడించి జగిత్యాల నుంచి జైత్రయాత్ర నిర్వహిస్తానని కవిత శపథం చేశారు. ఇప్పటికే ఆరుసార్లు జగిత్యాలలో గెలిచిన జీవన్ రెడ్డిని ఓడిస్తానని ఎత్తులు వేస్తోంది. కవిత అన్నీ తానై ఇక్కడ నడిపిస్తోంది. అడిగినన్ని నిధులు ఇప్పిస్తూ అభివృద్ధి చేయిస్తోంది.
ఇక జీవన్ రెడ్డి అనుచరులను టార్గెట్ చేస్తూ కవిత ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. జగిత్యాల జడ్పీటీసీ, రాయికల్, సారంగపూర్ ఎంపీపీలకు ఇప్పటికే గులాబీ కండువా కప్పేసింది. మరోవైపు జీవన్ రెడ్డి కూడా మరోసారి గెలిచేందుకు సై అంటున్నారు. కవితను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రచార పర్వాన్ని తీవ్రంగా చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ - టీఆర్ ఎస్ ఫైట్ ఇక్కడ యుద్ధాన్ని తలపిస్తోంది. జగిత్యాలలో గెలుపే ధ్యేయంగా కవిత - టీఆర్ ఎస్ నేతలు... జీవన్ రెడ్డిపై మాటల తూటాలు పేలుస్తున్నారు.
తాజాగా ఎంపీ కవిత... జీవన్ రెడ్డిని ఉద్దేశించి ముసలి పులి అని అభివర్ణించింది. దీనికి జీవన్ రెడ్డి కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడు. కవితలాగా బంగారు వడ్డానాలు , మేకప్ వేసుకోనంటూ చురకలంటించాడు. ఇక పరుష విమర్శలతో కవిత - జీవన్ రెడ్డి సై అంటే సై అంటున్నారు. దీంతో జగిత్యాలలో ఫైట్ నువ్వా నేనా అన్నట్టు ఉంది. మరి విజయం ఎవరినీ వరిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.