రాబోయే ఐదేళ్ల కాలంలో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన స్వీకర్ కు శుభాకాంక్షలు చెప్పే కార్యక్రమంలోమాట్లాడిన ముఖ్యమంత్రి.. తెలంగాణలో ఐదేళ్లలో కోటి 25వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. ఈమేరకు ప్రారంభించిన అన్ని ప్రాజెక్టుల్ని ఐదేళ్లలో పూర్తి చేస్తామన్నారు.
కేవలం ప్రాజెక్టులు పూర్తిచేయడానికే రానున్న ఐదేళ్ల లో లక్షా 17వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్టు కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. 2 లక్షల 25వేల రూపాయల ఖరీదైన ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 77వేల 777 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసినట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి... ఈ ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చారు.
వీటికి అనదంగా భూసేకరణ - నష్టపరిహారం - పునరావాసం కోసం అదనంగా మరో 22వేల కోట్లరూపాయలు ఖర్చు చేయబోతున్నట్టు ప్రకటించారు.మొత్తంగా ఇప్పటివరకు 99వేల 643 కోట్లరూపాయల ఖర్చు లెక్కతేలినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులతో పాటు గోదావరి - కృష్ణా నదులపై ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి స్థాయి లో వినియోగించుకుంటామన్నారు కేసీఆర్.
Full View