చేతికి ఎముక లేనట్లుగా వరాలు ఇచ్చేయటంలో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. సాధారణంగా అధినేతలు ఎవరైనా వరాలు ప్రకటిస్తుంటే.. సవాలచ్చ సందేహాలు వచ్చేస్తుంటాయి. కానీ.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం అందుకు భిన్నం. ఆయన వరాల్ని వరాలుగా ప్రకటించరు. మొదట ఆశల్ని.. ఆకాంక్షల్ని.. భవిష్యత్ కలల్ని ప్రస్తావిస్తారు. ఇవన్నీ ఎలా సాధ్యమబ్బా అన్న భావనకు గురి చేసిన తర్వాత.. అసలు విషయానికి వచ్చేస్తారు.
తాను చెప్పిన కలలు సాకారం కావటం పెద్ద కష్టమేమీ కాదన్న విషయాన్ని తేలుస్తూ.. అందుకు తగ్గ వరాలు ప్రకటిస్తారు. దీంతో.. భవిష్యత్తులో జరగబోయే మంచి మొత్తానికి తానే కారణమన్న భావన కలగజేయటంలో ఆయన నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుంటారు. ఇటీవల కాలంలో ప్రగతి భవన్ ను వేదికగా చేసుకొని..వరాల వర్షాన్నికురిపిస్తున్నారు.
బలహీన వర్గాలు.. చేతి.. కుల వృత్తులకు వారికి బోలెడన్ని ఆశల్ని కల్పిస్తూ.. రకరకాల వరాల్ని ఈ మధ్యన కేసీఆర్ ప్రకటించటం తెలిసిందే. ఈ వరాల పరంపరలో అంగన్ వాడీ టీచర్లు.. హెల్పర్లు.. వీఆర్ ఏల జీతాల్ని భారీగా పెంచనున్న విషయాన్ని వెల్లడించారు. ఇవి సరిపోవన్నట్లు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకంలో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల బ్యాంకు బకాయిల్ని రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఇలా ఆ వర్గం.. ఈ వర్గం అన్నతేడా లేకుండా పలు వర్గాలకు ఇచ్చిన వరాల లెక్కను వింటే షాక్ తినాల్సిందే.
ఇటీవల కాలంలో కేసీఆర్ నోటి నుంచి వచ్చిన వరాల జల్లులకు అవసరమైన నిధుల లెక్కను చూస్తే.. ఇది దాదాపు రూ.10,500 కోట్లకు పైనే అవుతుందని తేల్చారు. ఇవి సరిపోవన్నట్లుగా కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు.. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఎమ్మెల్యేలకు నిర్మించి ఇవ్వనున్న క్యాంప్ కార్యాలయాల భారం కలిపితే.. తడిపి మోపెడుఅవుతుందని చెబుతున్నారు.
రాష్ట్ర ఆదాయానికి ఢోకా లేకున్నా.. అదే పనిగా ఇస్తున్న వరాలతో ఆర్థిక శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతుందని చెబుతున్నారు. వీఆర్ ఏలు.. అంగన్ వాడీ టీచర్లు.. హెల్పర్ల వేతనాల పెంపు ఒక్క దాని కారణంగా ఏటా ప్రభుత్వం మీద పడనున్న భారం రూ.313 కోట్లుగా చెబుతున్నారు. తాజాగా జీతాల పెంపు కారణంగా ఒక్కోవీఆర్ ఏల జీతంలో ఏకాఏకిన రూ.5వేలు (సరిగ్గా చెప్పాలంటే రూ,4700) వరకూ జీతం పెరగనుంది. వీరి సంఖ్య రాష్ట్రంలో 19,345 మంది ఉన్నారు. ఇక.. అంగన్ వాడీ టీచర్ల జీతాలు ఒక్కొక్కరికి రూ.3500 చొప్పున పెంచటం కారణంగా రాష్ట్రంలోని 37500 మంది టీచర్లకు ప్రయోజనం కలగనుంది. ఇక.. అంగన్ వాడీ హెల్పర్లకు రూ.1500 చొప్పున జీతం పెంచనున్నట్లుగా చెప్పటం తెలిసిందే.
వీటన్నింటికి మించి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగే మహిళలకు.. కేసీఆర్ ఇవ్వనున్న కిట్ల ఖర్చు భారీగా ఉండనుంది. పిల్లలకు అవసరమైన సబ్బు.. షాంపో తదితరాలతో రూ.2వేలు విలువ చేసేకిట్లను ఇవ్వనున్నారు. ఇక..పుట్టింది ఆడపిల్ల అయితే మరో వెయ్యి రూపాయిల్ని అదనంగా ఇవ్వనున్నారు. ఇక.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి రూ.6వేలు ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. మొత్తంగా ఈవరాలకు కానున్న ఖర్చు రూ.300 కోట్లుగా చెబుతున్నారు. ఇలా ఒక్కొక్కటిగా ప్రకటించిన వరాల కారణంగా బడ్జెట్ అంచనాలు భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో బడ్జెట్ పద్దు అసెంబ్లీ ముందుకు రానున్న వేళ.. కేసీఆర్ ఇస్తున్న వరాల్ని ఎలా అడ్జెస్ట్ చేస్తారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/