అదేం సిత్రమో కానీ.. రాష్ట్ర విభజన తర్వాత చాలా సీన్లు పదే పదే రిపీట్ కావటం కనిపిస్తుంటుంది. అంతేకాదు.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పోలికలు కూడా చాలానే కలుస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే మరొకటి చోటు చేసుకుంది.
వర్షాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో.. గవర్నర్ నరసింహన్ అతిధ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారని.. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏదో విధంగా రాజీకి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందన్న వాదన వినిపించింది. అయితే.. అందుకు భిన్నంగా తనకు అనారోగ్యంగా ఉందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులు కూడా పెద్దగా పలుకరించింది లేదు. ఏపీ ముఖ్యమంత్రికి వీలైనంత దూరంగా ఉంటూ తెలంగాణ మంత్రులు జాగ్రత్తలు తీసుకున్నారు.
దాదాపుగా ఇలాంటి సీన్ మంగళవారం మరోసారి రిపీట్ అయ్యింది. గవర్నర్ విందునకు కేసీఆర్ గైర్హాజరు అయితే.. తాజాగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు ఏపీ ముఖ్యమంత్రి రాలేదు. జపాన్ పర్యటనలో ఉండటం దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇక.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించినప్పుడు ఏపీ మంత్రులు మర్యాదపూర్వకంగా దూరం నుంచే నమస్కారం చేసి ఊరుకున్నారు.
ఆయన దగ్గరకు వెళ్లటం.. మాట్లాడటం లాంటివి ఎవరూ చేయలేదు. ఇక.. రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాత్రం కాస్తంత కలుపుగోలుతనం కనిపించింది. విడిగా శివాలు ఎత్తే వారు.. ఎట్ హోం వేడుకలో మాత్రం ఒకేచోట కూర్చొని కబుర్లు చెప్పుకోవటం కనిపించింది.