ఎదుటివారి మనసు దోచుకోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసు. నచ్చని వారి విషయంలో ఎంత నిష్కర్షగా వ్యవహరిస్తారో.. నచ్చిన వారి విషయంలో అంతే ఉదారంగా వ్యవహరిస్తారు. నచ్చనప్పుడు దెయ్యం అన్న నోటి నుంచే నచ్చినప్పుడు దేవత అంటూ వ్యాఖ్యలు చేయటం కేసీఆర్‌కు మాత్రమే చెల్లుతుందన్న విషయం ఆందరికి తెలిసిందే.
రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి ఆయనకు స్వాగతం పలికిన సందర్భంగా ఆయనకు పాదాభివందనం చేసేందుకు కేసీఆర్ ఏ మాత్ర సంకోచించలేదు. బల్లారంలో పదిరోజుల పాటు విడిది ఉండేందుకు వచ్చిన రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన ఆయన.. తల వంచి పాదాభివందనం చేశారు.
దీనికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అప్యాయంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ వీపు తట్టి మరీ ఆశీర్వదించారు. ఎక్కడ వంగాలో.. మరెక్కడ అందుకు భిన్నంగా వ్యవహరించాలన్న విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. అందుకే అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించారంటూ ఓ టీఆర్‌ఎస్ నేత చేసిన వ్యాఖ్యలో నిజం ఉందనే చెప్పాలి.