బ్రేకింగ్: దళితబంధు పథకం ప్రారంభం

Update: 2021-08-05 10:34 GMT
తెలంగాణలో మరో సాహసోపేతమైన పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేశారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి దళితబంధు ప్రారంభించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

వాసాలమర్రి గ్రామానికి సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించారు. వాసాలమర్రిలోని అర్హులైన దళితుల కోసం 7.6 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. నిధుల విడుదలకు టీఎస్.సీసీ.డీఎస్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ అనుమతినిచ్చారు. ఈ పథకం కింద వాసాలమర్రికి సంబంధించిన 76 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

నిన్ననే దత్తత గ్రామం వాసాలమర్రికి వచ్చిన సీఎం కేసీఆర్ అక్కడి నుంచే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వెంటనే అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఆ నిధులను విడుదల చేశారు. గ్రామానికి రూ.7.6 కోట్ల నిధులను మంజూరు చేశారు.

దళితబంధు నిధులు విడుదల చేయడంతో వాసాలమర్రి దళితులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.




Tags:    

Similar News