సీఎం కేసీఆర్ సీన్లోకి రాకుంటే అక్క‌డ క‌ష్ట‌మ‌ట‌!

Update: 2019-04-04 05:07 GMT
ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించి సీఎం కేసీఆర్ ప్లానింగ్ స్ప‌ష్టంగా ఉంటుంది. ఆచితూచి.. అన్ని ర‌కాలుగా లెక్క‌లు వేసుకొని షెడ్యూల్ సిద్ధం చేసుకునే ఆయ‌న ప్లానింగ్ లో మార్పు చోటు చేసుకునే ప‌రిస్థితి నెల‌కొంది. తాను ప్ర‌చారానికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని కేసీఆర్ డిసైడ్ అయిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఇప్పుడొస్తున్న రిక్వెస్టుల పుణ్య‌మా అని ఆయ‌న సీన్లోకి దిగాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డిన‌ట్లు చెబుతున్నారు.

తొలుత చేసుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మొత్తం 17 ఎంపీ స్థానాల్లో 12 స్థానాల్లో మాత్ర‌మే ప్ర‌చారం చేయాల‌ని భావించారు. అయితే.. అదిలాబాద్‌.. చేవెళ్ల‌.. సికింద్రాబాద్‌.. మ‌ల్కాజిగిరిల‌లో ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం లేద‌నుకున్నారు. కానీ.. తాజాగా వ‌స్తున్న విన‌తుల నేప‌థ్యంలో తాను వ‌ద్ద‌నుకున్న నాలుగు ఎంపీ స్థానాల్లోనూ ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రాన్ని కేసీఆర్ గుర్తించిన‌ట్లుగా తెలుస్తోంది.

వాస్త‌వానికి తొలుత మ‌ల్కాజిగిరి.. సికింద్రాబాద్ ల‌లో ప్ర‌చారం చేప‌ట్టాల‌ని భావించారు. అయితే.. అనుకోని కార‌ణాల‌తో ఆ ప్రోగ్రాం ర‌ద్దు అయ్యింది. కానీ.. మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రిగా కేసీఆర్ ప్ర‌చారానికి రావాల్సిందేన‌న్న విన‌తులు బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల నుంచి అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి.

ఇటీవ‌ల హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన స‌భ అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌టం.. ఐదు వేల మంది కూడా జ‌నం రాక‌పోవ‌టంతో సీఎం ఆ స‌భ‌కు వెళ్ల‌కుండా ర‌ద్దుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. జ‌న‌సమీక‌ర‌ణ విష‌యంలో నేత‌లు ఫెయిల్ కాలేద‌ని.. పోలీసుల ఓవ‌రాక్ష‌న్ కార‌ణంగానే జ‌నాలు ఎల్ బీ స్టేడియంలోకి రాలేద‌న్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సీఎం తాజాగా వెళ్లాల‌ని భావిస్తున్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న స‌మీక‌ర‌ణ‌కు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాల‌న్న ఆదేశాలు జారీ అయిన‌ట్లు స‌మాచారం. మారిన ప్రోగ్రాంలో భాగంగా ఏప్రిల్ 7న అదిలాబాద్ లోని నిర్మ‌ల్ లో .. 8న చేవెళ్ల ప‌రిధిలోని వికారాబాద్ లో ఏర్పాటు చేసే స‌భ‌కు కేసీఆర్ వెళ్లాల‌ని డిసైడ్ చేశారు. ఇక.. మిగిలిన సికింద్రాబాద్‌.. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోనూ కేసీఆర్ స‌భ ఏర్పాటు చేయాల‌న్న విన‌తులు ఉన్నాయి. మ‌రి.. వాటి విష‌యంలో ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News