నియోజ‌వ‌ర్గం దాటాలంటే ప‌ర్మిష‌న్ ఉండాల్సిందే..

Update: 2016-10-20 07:04 GMT
ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా పాల‌న‌లో పూర్తిగా త‌న ఆలోచ‌న‌ల‌తోనే ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌శంస‌లు పొందుతోంది. ఎమ్మెల్యేలు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండాల‌ని.. నిత్యం హైద‌రాబాదులో ఉంటూ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌ట్టించుకోక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న త‌న ఎమ్మెల్యేల‌కు అంత‌ర్గ‌త హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. తన అనుమ‌తి లేకుండా నియోజ‌క‌వ‌ర్గం దాటొద్ద‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది.

నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేలు ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వారు ఉండాల‌ని, పార్టీ పిలిచేంత వ‌ర‌కు రాజ‌ధాని వైపు చూడ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్‌. ప‌రిపాల‌న సంతృప్తిక‌రంగా ఉంటే..  ఎమ్మెల్యేలు వ‌స్తే హైద‌రాబాద్‌ కు ఏమ‌వుతుంది? అని పార్టీ నాయ‌కుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు విష‌యం ఏంటంటే..?  ఇటీవ‌ల త‌న ప‌రిపాల‌న‌పై నిఘా వ‌ర్గాలు - ప్ర‌త్యేక స‌ర్వేల ద్వారా నివేదిక తెప్పించుకున్న కేసీఆర్ దాని ఆధారంగా ముందుకువెళ్తున్నారు.  వీరిలో ముందుగా ప్ర‌జ‌లు ఎవ‌రిపై అసంతృప్తిగా ఉన్నారో స‌ద‌రు ఎమ్మెల్యేల‌ను  పిలిపించి మంద‌లించి పంపారు. ఇక మిగిలిన వారిపై దృష్టి పెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలందరికి నేను చెప్పేవ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గం దాట‌కూడ‌ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు.

ప్ర‌స్తుతం కొత్త జిల్లాల్లో ప్ర‌జ‌ల‌కు - అధికారుల‌కు ప‌రిపాల‌న విష‌యంలో కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. ఇలాంటి ఇబ్బందుల విష‌యంలో ఒక్కోసారి ఉన్న‌తాధికారులు కూడా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేని ప‌రిస్థితి. అందుకే, ఈ త‌ర‌హా స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మైన వెంట‌నే స‌ద‌రు అధికారుల‌తో మాట్లాడి దాన్ని జిల్లా మంత్రి లేదా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురావాల‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త జిల్లాల్లో ఎస్పీ - క‌లెక్ట‌రేట్‌ - త‌హ‌సీల్దార్‌ - ఇత‌ర ప్ర‌భుత్వ ప‌రిపాల‌న సంస్థ‌ల‌కు - అందులో ప‌ని చేసే సిబ్బంది - వాటిని ఆశ్ర‌యించే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు రాకూడద‌ని, వ‌స్తే వారంతా ముందుగా నియోజ‌క‌వ‌ర్గ‌పు ఎమ్మెల్యేను సంప్ర‌దించేలా వారితో నిత్యం సంప్ర‌దింపులు జ‌రుపుతూ ఉండాల‌ని ఆదేశించారు. అందుకోసం ఎమ్మెల్యేలు క‌చ్చితంగా నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండాల‌ని... మ‌ళ్లీ తాను చెప్పేవ‌ర‌కు అదిపాటించాల్సిందేన‌ని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News