కేసీఆర్ నిర్ణ‌యంతో ​-​ హ్యాపీ న్యూ ఇయ‌ర్‌

Update: 2015-12-31 12:12 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రోమారు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు అందించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌ లో ఉన్న టీఆర్ ఎస్ ఎన్నిక‌ల హామీని నిల‌బెట్టుకునే నిర్ణ‌యం తీసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కాంట్రాక్ట్‌ - ఔట్‌ సోర్సింగ్‌ - నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలని - ఔట్‌ సోర్సింగ్‌ - హ్యాండ్ హోల్డింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో 50వేల మంది ఉద్యోగులు లబ్ది పొందుతున్నారు.

జనవరి 2న మంత్రివర్గ సమావేశంలో శాఖల వారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రోజు సచివాలయంలో నిర్వ‌హించిన‌ ఉన్నతస్థాయి సమీక్ష ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి - మంత్రులు ఈటెల రాజేందర్‌ - లక్ష్మారెడ్డి - పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. డీఎస్సీకి మార్గదర్శకాలు విడుదల చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు.
Tags:    

Similar News