బాబు వెళితే.. కేసీఆర్ డుమ్మా కొట్టారు

Update: 2015-09-29 04:32 GMT
తనకు నచ్చని వారి విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత కరుకుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చని వ్యక్తుల్ని మర్యాద కోసం కూడా కలిసేందుకు ఇష్టపడని వైనం ఆయన సొంతం. బతికి ఉన్నోళ్ల విషయంలోనే కాదు.. తిరిగి రాని లోకాలకు వెళ్లిన వారి విషయంలోనూ ఆయన అదే పట్టుదల ప్రదర్శిస్తారు.

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ మాష్టారుతో మెదలు పెడితే.. తెలంగాణ పెద్దమనషులైన చాలామందితో కేసీఆర్ కు సరైన టర్మ్స్ లేవనే చెబుతారు. తాజాగా తెలంగాణ పెద్దమనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ శతజయంతి వ్యవహారమే చూడండి. ఆయన శత జయంతి ఉత్సవాల్ని తెలంగాణ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బాగుందని అనుకున్నా.. శతజయంతి ఉత్సావ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి అన్ని పార్టీ నేతలు హాజరైనా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వైఖరిపై ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయని కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే కేసీఆర్ కు ఉన్న కోపమే తాజా వైఖరికి కారణంగా చెబుతారు. అదే సమయంలో గుర్రం జాషువా శత జయంతి ఉత్సవాల్ని ఏపీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఒకే రోజున.. ఇంచుమించు ఒకే సమయంలో వేర్వేరు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన మహానుభావుల శత జయంతి ఉత్సవాల్లో ఏపీ ముఖ్యమంత్రి అటెండ్ అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డుమ్మ కొట్టటం గమనార్హం.
Tags:    

Similar News