జాతిపిత అయితే.. అమరులకు ఈ పనులేం చేయరేం సారూ?

Update: 2019-09-28 10:02 GMT
తనకు తానే తెలంగాణకు జాతిపితనంటూ గొప్పగా కీర్తించుకునే ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. ఎవరికి వారు ఎక్కడా పొగుడుకోరు. కానీ.. అందుకు గులాబీ సారు మినహాయింపు. తాను చేసిన పనుల్ని గొప్పగా చెప్పుకోవటం.. తన తప్పుల్ని మాట వరసకు ప్రస్తావించకపోవటం.. తన ప్రత్యర్థుల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయటం లాంటివి ఆయనకు అలవాటే.

తెలంగాణ జాతిపితగా చెప్పుకునే ఆయన.. సంప్రదాయంగా చేయాల్సిన కొన్ని పనుల విషయంలో చాలా దూరంగా ఉంటారు. తెలుగు ప్రజల సంప్రదాయం ప్రకారం పెత్రామాస్య రోజున కాలం చేసిన వారికి ప్రత్యేక పూజలు చేయటం తెలంగాణ సమాజంలో ఉంది.

తెలంగాణ సాధనలో భాగంగా తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన అమరవీరులకు పెత్రామావాస్య నివాళులు ఎందుకు అర్పించరు సారు? అన్న ప్రశ్న ఇప్పుడు పలువురి నోట వినిపిస్తోంది. మరోవైపు ఈ పండుగ సందర్భంగా అమరవీరులకు టీజేఎస్ అధినేత కోదండం మాష్టారు అమరవీరులకు నివాళులు అర్పించారు.

తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తుగా నిర్మించాల్సిన చిహ్నం ఏమైందని ప్రశ్నించారు. నిజానికి తెలంగాణ జాతిపిత హోదాలో కేసీఆరే స్వయంగా ఉద్యమంలో ప్రాణాల్ని పణంగా పెట్టిన తెలంగాణలో వారిని సముచితంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా కీలకమైన వేళ.. కేసీఆర్ సారు కనిపించకుండా ఉండటం ఏమిటి?  ఇలాంటి వేళ ఎక్కడకు వెళ్లారు సారూ?



Tags:    

Similar News