ఆర్టీసీపై మాట మీద నిలబడ్డ కేసీఆర్!

Update: 2019-12-01 09:38 GMT
సీఎం కేసీఆర్ అన్నట్టే మాట మీద నిలబడ్డాడు.. కార్మిక సంఘాలను పక్కనపెట్టి స్వయంగా కార్మికులతోనే నేరుగా భేటి అవుతానని మొన్నటి సమ్మెకు ముగింపు సందర్భంగా చెప్పుకొచ్చాడు.

ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తన ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో భేటి అయ్యారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్ కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు.

కాగా ప్రధానంగా సీఎం కేసీఆర్ సమ్మె ముగిసిన నేపథ్యంలో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని కార్మికులకు తెలియజేశారు. సంస్థ బతకాలంటే సమ్మెలు వద్దని కష్టపడి పనిచేయాలని కార్మికులకు సూచించారు. సమ్మెలు చేయవద్దని సూచించారు.

ఇక నుంచి ఏ ఆర్టీసీ కార్మికుడు కార్మిక సంఘాలను సంప్రదించవద్దని.. వారి మాయలో పడవద్దని.. నేరుగా సమస్యలు తనకే వివరించాలని కేసీఆర్ సూచించారు.

ఇక సీఎం కేసీఆర్ తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారని.. తమను ఆదుకుంటారని కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News