రైతుబంధు - రైతు బీమా ఇలాంటి అద్భుత పథకాలకు రూపకర్తగా దేశవ్యాప్తంగా కేసీఆర్ పేరు మారుమోగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రైతుబంధును కాపీ కొట్టింది. ఇక ఈ బడ్జెట్ లో కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథను కూడా బీజేపీ కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు కు శ్రీకారం చుట్టింది.
తాజాగా కేసీఆర్ తన అమ్ముల పొదిలోని మరో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. మరో భారీ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో అనేక వ్యాధులతో బాధపడుతున్న అందరికీ ఉచిత వైద్యం అందించే గొప్ప పథకానికి ప్రణాళికలు చేస్తున్నట్టు తాజా సమాచారం. ఈ పథకం కనుక కేసీఆర్ అమలు చేస్తే దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేగడం ఖాయం. దేశంలోనే గొప్ప పథకంగా మారుతుందనే చర్చ సాగుతోంది.
అయితే ఈ పథకం అమలుకు ఆర్థిక వనరులు - తెలంగాణ బడ్జెట్ లో సరిపోతుందా అనే చర్చ సాగుతోంది. వీటన్నింటిని అధిగమించి ఈ పథకం అమలు చేస్తే కేసీఆర్ తెలంగాణ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
కేసీఆర్ తాజాగా యూనివర్సల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ను అమల్లోకి తేవడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ పథకాలను ఒకే గొడుకు కిందకు తెచ్చి నిధులు సద్వినియోగం చేసి అందరికీ ఉచిత వైద్యం అందించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే వివిధ ఉద్యోగులు - సంస్థలకు వైద్య సేవలను తెలంగాణ ప్రభుత్వం భరిస్తోంది. ఆర్టీసీ - ప్రభుత్వ - సింగరేణి - ఈఎస్ ఐ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందిస్తోంది. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఖర్చు భరిస్తోంది. అన్నింటిని కలిపి 2వేల కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్టు అంచనా. వీరంతా కలిసి రెండున్నర కోట్ల వరకు ఉన్నారు. మరో కోటి మంది వైద్య ఖర్చు భరిస్తే పూర్తి వైద్యం అందినట్టే. అందుకే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎవరెవరికి రోగాలు - వ్యాధులు ఉన్నాయని కేసీఆర్ సర్కారు లెక్క తేల్చింది. ఈ నేపథ్యంలో అందరికీ వైద్యం పై ఖర్చు ఎంతవుతుందనేది ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ పథకం అమలైతే తెలంగాణ ప్రజలకు గొప్ప ఊరటగా.. కేసీఆర్ పేరు దేశమంతా మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది.