వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఏంటి? బీజేపీ విషయంలో జగన్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారు? అదేసమయంలో తన సోదరి.. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల విషయంలో జగన్ ఎలాంటి అడుగులు వేయాలని అనుకుంటున్నారు? ఇదీ.. ఇప్పుడు.. ప్రగతి భవన్ వర్గాల్లో తరచుగా తెరమీదికి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే.. ఎంత లేదన్నా.. ఎంత కాదన్నా.. తన పార్టీని పరుగులు పెట్టించిన.. షర్మిలకు.. అంతో ఇంతో జగన్ సాయం చేయకుండా ఉండరని భావిస్తున్నారు.
అదేసమయంలోజగన్ తన సోదరి రాజకీయ రంగ ప్రవేశంపై పైకి ఎన్ని చెబుతున్నా.. అంతర్గత సహకా రం ఉంటుందని.. కూడా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అంచనా వేస్తున్నారట. ఎందుకంటే.. ఏపీలో రెండు సార్లు జగన్ కోసం.. ఆమె పాదయాత్ర చేయడం.. ప్రజల్లోకి వెళ్లడం.. వీధి వీధి తిరగడం వంటివి.. చేసింది.
ఈ క్రమంలో ఆరుణం తీర్చుకోకుండా.. ఉండరని.. ఈ క్రమంలోనే పైకి అంతా వ్యతిరేకంగా ఉంటూనే అంతర్గతంగా.. సాయం చేసే అవకాశం లేకపోలేదని.. చర్చ సాగుతోంది.
ఇటీవల వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాకు విజయమ్మ రాజీనామా చేశారు. అయితే.. జగన్ ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించారని.. తనకు రాజకీయంగా చేదోడుగా ఉన్న తల్లిని వదిలించుకున్నా రని.. ఒక ప్రచారం వచ్చింది. అయితే.. దీనిని నాణేనికి ఒక వైపు మాత్రమే చూడాలని.. రెండో వైపు.. తెలంగాణలో సోదరికి బలం చేకూరేందుకు.. ఆమెపై రాజకీయంగా విమర్శలు రాకుండా చూసేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారని.. కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
అంటే.. తెలంగాణలో రేపు విజయమ్మ షర్మిల తరఫున ప్రచారం చేస్తే.. ఆమెపై.. ఏపీలో వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారంటూ.. విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అది చెల్లి పార్టీకి మైనస్ అవుతుంది. అదేసమయంలో ఆమె కూడా.. ఎటూ చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది.
ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా జగన్ వ్యవహరించారని అంటున్నారు. ఇక, ఆర్థికంగా కూడా సాయం చేసే అవకాశం ఉందని కేసీఆర్‌కు ఉప్పందినట్టు ప్రగతి భవన్ వర్గాల మధ్య గుసగుస వినిపిస్తోంది. ఏదేమైనా.. జగన్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని.. అదేంటనేదానిపై కేసీఆర్ దృష్టి పెట్టారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం గమనార్హం.