ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ముందే చెప్పా.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇక, బీజేపీ పని అయిపోతోందని.. గద్దె దిగిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాను చెప్పిందే నిజమైందన్నారు.
యూపీలో బీజేపీ బలం తగ్గుతుందని గతంలోనే చెప్పానని కేసీఆర్ అన్నారు. గతంలో 312 చోట్ల గెలిచిన బీజేపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో 255 స్థానాలకు పరిమితమైందన్నారు. సీట్లు తగ్గడం దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలని అన్నారు. బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందన్నారు.
బీజేపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురాలేదని సీఎం మండిపడ్డారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాలని ప్రజలు భావిస్తున్నారని సీఎం వెల్లడించారు. యూపీఏ పాలన సరిగా లేదని ప్రజలు బీజేపీకి అధికారం ఇస్తే.. మోడీ నాయకత్వంలో బీజేపీ మరింత అధ్వాన పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను తాబేదార్లకు చౌకగా కట్టబెడుతున్నారని సీఎం ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని.. ఉపాధి లేదు, ఉద్యోగాలు అంతకన్నా లేవని దుయ్యబట్టారు.
``ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విద్యార్థులను కేంద్రం ముందే అప్రమత్తం చేయలేదు. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు రావద్దని మేం చెప్పాం. అభివృద్ధి, ఉపాధి కల్పన తదితర రంగాల్లో భారత్ ర్యాంకు అధ్వానంగా ఉంది.
ఏ రంగంలో చూసినా దేశం తిరోగమనంలోనే ఉంది. కేంద్ర విధానాలను తిప్పికొట్టాలని తీర్మానించాం. కేంద్ర వ్యతిరేక ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించాం. బీజేపీ.. దేశ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయ చేయడం తప్ప ఏమీ లేదు`` అని కేసీఆర్ తనదైన స్టయిల్‌లో విరుచుకుపడ్డారు.
రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో లేదని.. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఎక్కడా అమలు కావట్లేదని సీఎం కేసీఆర్ అన్నారు. రిజర్వేషన్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో రిజర్వేషన్లపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక పంపామన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుకుంటామని కేంద్రానికి పంపామని తెలిపారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నుంచి సమాధానం రాలేదని ఆయన మండిపడ్డారు.
బీసీల కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదన్నారు. ప్రగతిశీల ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నా లు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. విభజన రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో తన అవసరం ఉన్నప్పుడు.. తప్పకుండా పనిచేస్తానని.. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని అన్నారు.
అంతేకాదు.. ఇప్పటికే దీనిపై ప్రత్యేకంగా తాను దృష్టి పెట్టానని కేసీఆర్ చెప్పారు. ప్రతి విషయంలో నూ ప్రజలను అడ్డగోలుగా మోసం చేస్తున్న బీజేపీని గద్దెదింపేందుకు తమ ప్రయత్నం కూడా అవసరం లేకుండా.. ప్రజలే సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.