తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు దేశ రాజకీయాలపై స్పందించారు. ఈ దఫా ఏకంగా ఢిల్లీ పెత్తనం ఎందుకని ఆయన నిలదీశారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు నేతలు హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ ఆఫీసులో కేసీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు. ప్రగతి భవన్ లో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన కేంద్రం తీరుపై, జాతీయ పార్టీలు ప్రజలకు చేస్తున్న మోసాలపై గళమెత్తారు. ఢిల్లీ పెత్తనం ఇంకా ఎంత కాలం అని ప్రశ్నించారు. చైనాను చూసైనా నేర్చుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం 14 ఏళ్ల కాలంలో చైనా అత్యంత బలమైన దేశంగా ఎదిగిందని కేసీఆర్ ఆన్నారు. ఆర్థికంగా చైనా అమెరికా తరువాత అత్యంత బలమైన దేశంగా ఎదిగిందని, ఆ విషయం ప్రస్తావిస్తే చైనా రాజ్యాంగం ప్రత్యేకమైనదని అంటారనీ, మరి మన రాజ్యాంగం ఎందుకు మార్చుకోరని కేసీఆర్ ప్రశ్నించారు.
అమెరికాలో నిజమైన ఫెడరల్ వ్యవస్థ ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరి మన రాష్ట్రంలో ఫెడరల్ వ్యవస్థ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయన్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేక జీడీపీ ఉందన్నారు. అలాగే అక్కడి డీజీపీ ఆ మేయర్ కింద పని చేస్తారని అన్నారు. అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర సుప్రీం కోర్టు లు ఉన్నాయన్నారు. అన్నిటికీ కలిపి ఉన్నది ఫెడరల్ కోర్టు అన్నారు. మరి ఇక్కడో అన్నీ ఢిల్లీ…ఢిల్లీ…ఏం ఢిల్లీ పెత్తనం ఏమిటి? దాని గొప్పదనమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రం తమ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుందని అన్నారు. రాష్ట్రాలకు అధికారాలు ఎందుకు ఉండవని ప్రశ్నించారు.
రాష్ట్రాలలో రిజర్వేషన్లపై కేంద్రం పెత్తనమేమిటని కేసీఆర్ ప్రశ్నించారు. మన రాష్ట్రం తీసుకుంటే ఇక్కడ 85శాతం మంది దళితులు, గిరిజనులు, ముస్లింలు ఉన్నారనీ, వీరందరికీ కలిపి రిజర్వేషన్లు 50శాతం మించకూడదన్న నిబంధన ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రం పరిస్ధితిని బట్టి ఆ రాష్ట్రం రిజర్వేషన్లు ఖరారు చేసుకునే అధికారం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలలో రోడ్లకు ప్రధానికి సంబంధం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ఏమిటని నిలదీశారు. రాష్ట్రాలలో ప్రభుత్వాలు లేవా? అని ప్రశ్నించారు. విద్యా, వైద్యం, రోడ్లు, రిజర్వేషన్లు అన్నీ రాష్ట్రాలకు సంబంధించిన విషయమని దీనిపై కేంద్రం పెత్తనమేమిటని కేసీఆర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అన్ని విధాలుగా అన్యాయం చేసి ఆ రెండు రాష్ట్రాలూ ఘర్షణ పడుతుంటే తమాషా చూస్తూ కూర్చుంటారా? అని కేంద్రంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్ ప్రశ్నల వర్షం గుప్పించారు. విభజన చట్టం అమలులో ఎందుకింత తాత్సారం అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు ఊసే లేదు అని విమర్శించారు. దేశానికి త్వరలో ట్రూత్ ఫుల్ కోపరేటివ్ ఫెడరలిజం తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. మీ కష్టాలు మీరు పడండి…ఢిల్లీలో కూర్చుని తమాషా చూస్తామంటే ఇక కుదరదని కేంద్రాన్ని హెచ్చరించారు. `రాజ్యాంగమైనా - ప్రధాన మంత్రి అయినా ఉన్నది ప్రజల కోసమేనని కేసీఆర్ అన్నారు. అయినా కేంద్రానికి రాష్ట్రాలలోని దావఖాన వద్ద - మునిసిపాలిటీ వద్ద - పంచాయతీల వద్ద కేంద్రానికి ఏం పని అని ఆయన ప్రశ్నించారు. ఏం రాష్ట్రాలలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు లేవా? ముఖ్యమంత్రులు లేరా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకు తాను తొలి అడుగు వేస్తానని కేసీఆర్ ప్రకటించారు.
జాతీయ రాజకీయాల్లోకి తాను ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించిన 24 గంటలలోనే దేశం నలుమూలల నుంచి అనూహ్య మద్దతు లభించిందని కేసీఆర్ చెప్పారు. భావసారూప్య పార్టీలతో చర్చించి దేశానికి ఆమోదయోగ్యమైన అజెండాతో మీ ముందుకు వస్తామని ఆయన చెప్పారు. జాతీయ రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. దేశాన్ని మార్చేందుకు తొలి అడుగు తెలంగాణ నుంచే పడిందని ఆయన అన్నారు. కేంద్రానికి అపరిమిత అధికారాలు ఉండడానికి వీల్లేదన్నారు. సమూలమైన మార్పు రావాలంటే ఎక్కడో అక్కడ తొలి అడుగు పడాలని, అది తెలంగాణ నుంచే పడిందని కేసీఆర్ చెప్పారు. `కేంద్రం ఏమీ చేయదు? ఎందుకు చేయలేదంటే జైలుకు పంపిస్తామని బెదరిస్తారు. ఏమిటిది? జైలుకు భయపడితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించేవాడా?` అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇటాంటి పిట్ట బెదరింపులు కేసీఆర్ ను భయపెట్టలేవని చెప్పారు. భావసారూప్యత కలిగిన అన్ని పార్టీల నాయకులతోనూ చర్చించి త్వరలో ప్రత్యామ్నాయ రాజకీయంపై ఒక నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు.
తాను చేసిన మూడో ఫ్రంట్ ప్రతిపాదనకు పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మహారాష్ట్ర నుంచి ఎంపీలు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారని చెప్పారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేసి అభినందించారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లు పని చేయడం లేదని ప్రజలకు అర్ధమైందని కేసీఆర్ అన్నారు. జాతీయ పార్టీలు ప్రజలతో ఆడుకుంటున్నాయన్నారు. మూడో ఫ్రంట్ ప్రతిపాదనకు మమత బెనర్జీ పూర్తిగా మద్దతు పలికారని కేసీఆర్ అన్నారు.