గుణాత్మక రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు తాను రాజకీయాల్లోకి వస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ - కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ రాజకీయాల్లోకి వస్తుంటే...కేసీఆర్ రాకను ప్రాంతీయ పార్టీల నేతలు స్వాగతిస్తుంటే కాంగ్రెస్ - బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణను సైతం తన ప్రకటన తర్వాత కేసీఆర్ మొదలుపెట్టారు. అయితే కేసీఆర్ కసరత్తు ఇప్పుడు మొదలయిందే కాదని అంటున్నారు. ప్రత్యామ్నాయ కూటమిపై కేసీఆర్ ఈ నెల మూడో తేదీన ప్రకటన చేసినప్పటికీ... నెల రోజుల ముందునుంచే కసరత్తు ప్రారంభించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత నెల ఢిల్లీ పర్యటనలో గులాబీ దళపతి కేసీఆర్ ఇందుకు తగిన అడుగులు వేశారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇందుకు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం వేదికగా మలుచుకున్నారు. గత నెల తొమ్మిదో తేదీన కేసీఆర్ ఢిల్లీకి వచ్చారు. దంత సమస్యపై చికిత్స అని ప్రకటించినప్పటికీ...ప్రత్యామ్నాయ కూటమి ప్రధాన ఎజెండాగా వచ్చినట్టు సమాచారం. పది రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్... ఈ సమయంలోనే టీఎంసీ నేత మమతాబెనర్జీతో - జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ తో - మహారాష్ట్ర ఎంపీలు - సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరికి సైతం కేసీఆర్ ఫోన్ చేసినట్టు సమాచారం. ఫిబ్రవరి 11వ తేదీన ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఏచూరికి ఫోన్ వెళ్లింది. అయితే ఆ సమయంలో ఏచూరి ఏపీలో ఉన్నారు. ఆ రాష్ట్ర పార్టీ మహాసభలకు హాజరయ్యేందుకు భీమవరం వెళ్లారు. ఏచూరికి ఫోన్ చేసిన కేసీఆర్ 'ముఖ్యమైన అంశంపై మాట్లాడాలి' అని చెప్పినట్టు సమాచారం. అయితే తాను ప్రస్తుతం ఏపీలో ఉన్నానని - ఢిల్లీకి వచ్చిన తరువాత కలుస్తానని చెప్పినట్టు తెలిసింది. 13వ తేదీన ఏచూరి ఢిల్లీ వచ్చినప్పటికీ ఆ మరుసటి రోజు మధ్యాహ్నమే మహారాష్ట్ర - తమిళనాడు - కేరళ తదితర ఐదు రాష్ట్రాల పార్టీ మహాసభలకు బయల్దేరి వెళ్లారు. కేసీఆర్ ఫోన్ విషయంపై ఏచూరీని ఆరా తీయగా.. కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చినట్టు చెప్పారు. అయితే ఏచూరి దక్షిణాది రాష్ట్రాల పార్టీ మహాసభల్లో బిజీబిజీగా గడపటంతో ఇరువురి మధ్య సమావేశం కుదరలేదని తెలిసింది.
ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు లో రహస్యం ఏమీలేదని కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. కొంత గోప్యత పాటించారు. తన ప్రతిపాదనకు వివిధ పార్టీల నుంచి ఆశించిన స్పందన రావడంతో అధికారికంగా ప్రకటించారని తెలిసింది. ప్రత్యామ్నాయ కూటమి లక్ష్యంగా కేసీఆర్ గత నెలలో హస్తిన బాట పట్టారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు -23 వేదికగా వివిధ పార్టీల నేతలతో చర్చించారు. ప్రధానంగా బీజేపీ సర్కారుపై అసంతృప్తిగా ఉన్న నేతలతో చర్చలు జరిపారు. జాతీయస్థాయిలో మోడీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. అదే సమయంలో బీజేపీకి కేంద్రస్థాయిలో బలమైన ప్రతిపక్షం లేదు. ప్రధాన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తోంది. పైగా ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మోడీని ఢీకొట్టే స్థితిలో లేరు. మోడీని నిలువరించే వాగ్ధాటి - ప్రజల్లో చొచ్చుకుని వెళ్లే స్వభావం రాహుల్ గాంధీకి లేవు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే స్థితి ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ కు లేదన్న ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ కూటమికి శ్రీకారం చుట్టారని సమాచారం. అదే సమయంలో విభజన హామీలపై కానీ - కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో కానీ - ప్రాజెక్టులకు ఆర్థికసాయం చేయడంలో కానీ మోడీ సర్కారు తీవ్ర అలసత్వం ప్రదర్శించింది. వీటన్నింటి నేపథ్యంలో అవసరమైతే తానే ప్రత్యామ్నాయ కూటమికి నేతృత్వం వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. తెలంగాణలో అధికారం విషయంలో ఢోకా ఉండబోదన్న అంచనా వేశారు. దేశ రాజకీయాల వైపు కేసీఆర్ తన చూపు తిప్పారు. 2019 ఎన్నికల్లో మోడీ 'హవా' ఉండబోదని మొదటి నుంచి చెబుతూ వస్తున్న కేసీఆర్... బీజేపీతో పొత్తులు - ఎన్నికలపై ఆరా తీయగా దాటవేస్తూ వచ్చారు. గతంలో ఢిల్లీలో విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడిన సమయంలోనూ.. 'సమయమే అన్నింటికి సమాధానం చెబుతుంది' అని అన్నారు. మోడీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత బట్టి.. మూడో ఫ్రంటా మరోటా అనేది తెలుస్తుందని అన్నారు.
దేశం బాగుపడాలని - దేశ ప్రజలు బాగుండాలని ఆలోచించే ప్రతి ఒక్క వర్గంతో మాట్లాడడం ద్వారా ఈ దేశానికి అవసరమైన ఎజెండాను రూపొందించవచ్చని కేసీఆర్ ఆలోచనగా ఉంది. కేసీఆర్ సారధ్యంలో కూటమి ఏర్పాటుపై జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభంకావడంతో దీనికి అనుకూలంగా మలుచుకుంటామని టీఆర్ ఎస్ నేతలు గంటాపథంగా చెబుతున్నారు. మరోవైపు దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న సీఎం కేసీఆర్ కు ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ నేత అజిత్ జోగి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు జోగి ఫోన్ చేశారు. సీఎం కేసీఆర్ కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తే దానిలో తాను భాగస్వామి అవుతానని జోగి తెలిపారు. భావ సారూప్యత ఉన్న జాతీయ స్థాయి నేతలతో సంప్రదింపులు జరిపి ఫ్రంట్ ఏర్పాటులో తనదైన పాత్ర పోషిస్తానని జోగి చెప్పారు.