ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోయిందని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశా రు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా నాణ్యంగా జరుగుతోందని తెలిపారు.. కానీ, ఏపీలో ఇప్పటికే అప్రకటిత, అనధికార కోతలు పెరిగిపోయాయని.. ఇంకా వేసవి రాకుండానే కోతలు పెరిగాయని అన్నారు.
``రాష్ట్రంలో అంధకారం అలుముకుంటుందని అవాస్తవాలు ప్రచారం చేశారు. అప్పడు విమర్శ లు చేసిన ఏపీలోనే ఇప్పుడు అంధకారం ఉంది. తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఏడేళ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి`` అని కేసీఆర్ చెప్పారు.
నారాయణ్‌ఖేడ్‌లో సీఎం కేసీఆర్.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల పథకాల శిలాఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. గతంలో నారాయణఖేడ్ చాలా వెనకబడి ఉండేదని సీఎం గుర్తుచేసుకున్నారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అభివృద్ధి పనులు చేపట్టారని కొనియాడారు. జహీరాబాద్‌లో చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉండేదన్న సీఎం... ఈ ఎత్తిపోతల ద్వారా నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు లబ్ధి చేకూరనున్నట్లు చెప్పారు.
సంగారెడ్డి జిల్లాలో రూ.4,427 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాల ద్వారా 3.87 ఎకరాలకు సాగునీరు అందిం చనున్నట్లు స్పష్టం చేశారు. రానున్న రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఈ ప్రాంతానికి వస్తే పది మంది కార్యకర్తలు ఉండేవారని, ప్రజల్లో కూడా పెద్దగా ఆశ ఉండేది కాదని అన్నారు.
``కేసీఆర్ వస్తుండు.. పోతుండు.. తెలంగాణ వస్తదా.. రాదా.. అని అనేక సందేహాలు ఇక్కడి ప్రజల్లో ఉండేవి. వేరే పార్టీల వారు కూడా ప్రజలను గందరగోళానికి గురి చేసేవారు. తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశా. ఉద్ధృతంగా ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయని కొంత మంది చెప్పారు``. అని విరుచుకుపడ్డారు.
బంగారు భారత్ కోసమే
భారతదేశం బాగుకోసమే తాను దేశ రాజకీయాల్లోకి వెళుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బంగారు భారత్‌ను తయారు చేసుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తయారుచేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారని... విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగుచేసుకుందామని సభలో సీఎం స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అందరి దీవెన కావాలని ఆయన కోరారు.
``బంగారు భారత్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలి. భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారు. విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగు చేసుకుందాం`` అని కేసీఆర్ పిలుపునిచ్చారు.