కేసీఆర్ ప్రకటించిన మూడో ఫ్రంట్ అనే కసరత్తుకు.. మరికొన్ని రోజులు వారాల్లోనే ఒక స్పష్టత రానుందా. తొందర్లోనే ఒక రూపాన్ని సంతరించుకుని.. మోడీ వ్యతిరేక ప్రచారంతో ఎన్నికల బరిలోకి దిగనుందా? పొరుగున ఉన్న దక్షిణాది రాష్ట్రం ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న కర్ణాటక అసెంబ్లీ బరిలోనే దీనికి శ్రీకారం దిద్దుతున్నారా? అనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మూడో ఫ్రంట్ ను రూపుదిద్ది దేశవ్యాప్తంగా రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తయారుచేస్తున్నా అంటూ ప్రకటించిన మూడు నాలుగురోజుల్లోనే కేసీఆర్ చాలా యాక్టివ్ అయ్యారు.
జాతీయ వ్యాప్తంగా అనేక పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కేసీఆర్ కు ఫోన్లు చేసి మాట్లాడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మమతా బెనర్జీ లాంటి ఉద్దండ పిండాలు కూడా కేసీఆర్ తో టచ్ లోకి వస్తున్నారు. సాధారణంగా మరో కూటమి అంటూ ఏర్పడితే.. తానే ప్రధాని కావాలనేంత కాన్ఫిడెన్స్ ఉండే మమతా బెనర్జీ కూడా కేసీఆర్ వెంట నిలవడానికి సుముఖంగా ఉండడం చిన్న సంగతి కాదు. అయితే మూడో ఫ్రంట్ ఏర్పాటుచేస్తా అని ప్రకటించేసి.. ఊరకుండిపోతే.. ఇప్పుడు అందుతున్న మద్దతు ఈ స్ఫూర్తి, ఈ ఫైర్ మొత్తం చితికిపోతుందని కేసీఆర్ కూడా భావిస్తున్నట్లు సమాచారం.
మూడో ఫ్రంట్ అనే ఆలోచన మరింతగా సూపర్ హిట్ కావాలంటే.. తక్షణం రంగంలోకి దిగి ఎంతో కొంత ప్రభావం చూపించాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. అందుకు అనువుగా ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగబోతోంది. పైగా కన్నడ రాష్ట్రంలో తెలుగు ప్రాబల్యం కూడా ఎక్కువ. దానిని మించి.. చాలా వరకు కర్నాటక ప్రాంతాలు నిజాం సంస్థానుంచి విడివడి.. ఆ రాష్ట్రంలో భాగంగా చేరినవే.
వారందరినీ కూడా కేసీఆర్ చాలా సులువుగా ఆకట్టుకోగలరు. పైగా కన్నడ సీమలో కేసీఆర్ ఏయే జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా అయితే మూడో కూటమి రావాలని అనుకుంటున్నారో.. ఆ రెండు పార్టీలు కాంగ్రెస్, భాజపా అధికారం కోసం తలపడనున్నాయి.
అయితే కేసీఆర్ మూడో కూటమి ఆలోచనకు ఎడ్వాంటేజీ ఏంటంటే.. ఆ రాష్ట్రంలో మూడో పార్టీగా జనతాదళ్ కూడా చురుగ్గా ఉంది. ఆ పార్టీని తమ కూటమిలోని పార్టీగా కలుపుకుని.. వారికి అనుకూలంగా ప్రచారం నిర్వహించి.. ఫలితం చూపించగలిగితే.. దేశవ్యాప్తంగా దాని ఎఫెక్ట్ చాలానే ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారట. ఆ లెక్కన తొందర్లోనే రాబోతున్న కర్నాటక ఎన్నికల సమయానికే మూడోఫ్రంట్ కు నిర్దిష్ట రూపం రావడమూ, ఎన్నికల బరిలో కేసీఆర్ ప్రచారం నిర్వహించడమూ తథ్యం అని పలువురు జోస్యం చెబుతున్నారు.