కేంద్రంలోని బీజేపీపై ప్రత్యక్ష యుద్ధానికి సీఎం కేసీఆర్ తొలి అడుగు వేశారు. ఇవాళ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. మహారాష్ట్రకు విమానంలో బయలు దేరి వెళ్లారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే క్రమంలో అనేక ప్రాంతీయ పార్టీల సీఎంలతో కేసీఆర్ చర్చలు జరుపబోతున్నారు. ఇందులో భాగంగానే ముంబైలో కీలక చర్చలు జరుపనున్నారు.
శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సీఎం కేసీఆర్ భేటి కానున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. కేంద్రంలోని బీజేపీపై పోరాటం కొనసాగించేందుకు చర్చలు జరుపనున్నారు.
11 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లారు కేసీఆర్. మధ్యాహ్నం 1 గంటలకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు.
ఇక సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటి అవుతారు. ఈ భేటిలో జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు. అంతేకాకుండా గవర్నర్ల దూకుడు వ్యవహారంపై కూడా భేటిలో చర్చించనున్నారు. అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు వస్తారు.
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముంబైలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్ కీ నేత అంటూ నినాదాలతో.. కేసీఆర్ కు మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంల ఫొటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ముంబైలో సీఎం కేసీఆర్ పర్యటన ఇప్పుడు దేశ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
గత కొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సీఎంలతో, మాజీ ప్రధానితో ప్రత్యేకంగా మాట్లాడారు.
ముంబై పర్యటన ముగిసిన తర్వాత కేసీఆర్ కర్ణాటక వెళ్లనున్నారని సమాచారం. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో భేటి కానున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో మమతాబెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.