ఉప్పు-నిప్పు ఎప్పుడైనా ఒకటవుతాయా? కాదు కదా.! అలాగే.. ఒక ఫైర్ బ్రాండ్.. మరో ఫైర్‌బ్రాండ్‌కు శుభాకాంక్షలు చెబుతారా? లేదు కదా..! కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తలుచుకుంటే.. ఏదైనా సాధ్యమే అంటున్నారు పరిశీలకులు. గత ఏడాది పార్టీ నుంచి గెంటేసి.. హుజూరాబాద్‌లో ఓటమి చవి చూసే వరకు నిద్రపోనని అంతర్గత శపథం పట్టిన కేసీఆర్.. అదే నాయకుడు.. ప్రస్తుత బీజేపీ సభ్యుడు.. ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా శుభాకాంక్షలు చెప్పారు. నిజానికి ఇది ఎవరూ ఊహించరు కదా! కానీ, నిజమే. జరిగింది!
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో తిరిగిన ఈటలకు గత ఏడాది పొగ పెట్టారో.. లేక ఏం జరిగిందో మంత్రి పదవిని ఊడ గొట్టారు. అనంతరం .. ఆయనను పార్టీ నుంచి వెళ్లేలా చేశారు. ఆయన హ్యాచరీస్‌పై కేసులు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో నే ఈటల.. కేసీఆర్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. నిన్ను ఓడిస్తా అని కేసీఆర్ అంటే.. నీ అంతు చూస్తా.. అంటూ.. ఈటల అన్నారు. మొత్తంగా ఈటల బీజేపీలోకి వెళ్లిపోవడం.. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక రావడం.. తెలిసిందే.
అంతేకాదు.. ఈటల గెలిచిన తర్వాత కూడా సభలో ఆయనకు ఎలాంటి మర్యాద కూడా ఇవ్వకుండా చేశారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గుండుగుత్తుగా బీజేపీకి ఉన్న ముగ్గురు సభ్యులను సమావేశాలు అయ్యే వరకు కూడా సస్పెండ్ చేసేశారు. అలాంటి పరిస్థితిలో అనూహ్యంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈటలకు కేసీఆర్ లేఖ పంపారు. ఈటలకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నట్లు లేఖలో తెలిపారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం.
ఇక, శామీర్పేట్లోని ఈటల రాజేందర్ నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేకు కట్ చేసి బర్త్డేను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఈటల అభిమానులు, పార్టీ నేతలు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈటల రాజేందర్కు గవర్నర్ తమిళిసై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని... ప్రజాసేవలో తరించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అదేవిధంగా విజయశాంతి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.