తొందరపడి మాట్లాడటం ఎందుకు? ఆ తర్వాత తీరిగ్గా బాధ పడటంలో అర్థం లేదు. ఇప్పుడా సూక్ష్మం బాగానే అర్థమవుతున్నట్లుంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కున్న రాజకీయాల్లో తెగింపును అందరూ ఇష్టపడతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని ఆయనకు పేరు. అయితే.. ఆయన దూకుడు అంతకంతకూ పెరిగి తాను ఎవరిని ఎంతలా నిందిస్తున్నానన్న విషయాన్ని ఒక దశలో మర్చిపోయారు.
ఇలాంటి అవకాశాన్ని గుర్తించే నేతలు కొందరు.. కేజ్రీవాల్ నోరు జారిన ప్రతిసారి ఆయనపై కేసు బుక్ చేశారు. కేసుల విచారణ కోర్టుల వరకూ వెళ్లటం.. తిట్లకు కోర్టులు స్పందించటం.. సారీ చెబితే వదిలేస్తానటం లాంటివి జరిగాయి. న్యాయస్థానం గుమ్మం వరకూ వెళ్లిన తర్వాత కానీ.. తాను చేసిన తప్పుల తీవ్రతను గుర్తించారు. ఇలాంటి వివాదాల్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలన్న విషయాన్ని గుర్తించారు.
ఇందులో బాగంగానే ఆకాలీదళ్ నేత బిక్రం మజిథియాకు బహిరంగ సారీ చెప్పేశారు. గతంలో దేశం మొత్తంలోనే అతిపెద్ద అవినీతి పరుడంటూ నితిన్ గడ్కరీ మీద చేసిన విమర్శలు సైతం ఇప్పుడు కోర్టు గుమ్మాన్ని ఎక్కాయి. దీనిపై తాజాగా విచారం వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్.. తాజాగా మాట్లాడిన ఆయన తనకు నితిన్ మీద ఎలాంటి పగ. ప్రతీకారం లేదని.. కాకుంటే ఆధారాలు లేకుండా విమర్శలు చేసినందుకు విచారం వ్యక్తం చేశారు. నితిన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన దానిని మర్చిపోయి.. కోర్టు కేసును ముగిద్దామని తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి.. దీనిపై గడ్కరీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
తనపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి గడ్కరీ రూ.33 కోట్ల పరువునష్టం దావాను వేశారు. మరి.. తాజాగా చెప్పిన సారీ నేపథ్యంలో తన కేసును గడ్కరీ విత్ డ్రా చేసుకుంటారో లేదో చూడాలి.