కమ్యూనిస్టు నాయకులంటే నిరాడంబరతకు మారుపేరు. కమ్యూనిజం కోసం పోరాడే వాళ్లు ఆడంబరాల మీద దృష్టిపెడితే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా రూటు మార్చేశారు. వాళ్ల ఇళ్లల్లో పెళ్లిళ్లు కూడా ఇప్పుడు భారీ హంగామా మధ్య జరుగుతున్నాయి. కోట్లకు కోట్లు ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నారు కొందరు కమ్యూనిస్టు నేతలు. కేరళకు చెందిన సీపీఐ నాయకురాలు గీతా గోపి కూతురి పెళ్లి జరిగిన తీరు చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయడమే కాదు.. పెళ్లి కూతురిని ఒంటినిండా బంగారంతో సింగారించి పెళ్లి వేదికపై నిలబెట్టారు. ఆమె ఇంటి మీద బంగారం కిలోల లెక్కనే ఉంటుందని ఫొటో చూస్తే చెప్పేయొచ్చు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కమ్యూనిస్టులు ఎంతగా మారిపోయారో చూశారా.. సీపీఐ నేత కూతురు ఎంత నిరాడంబరంగా ఉందో చూశారా అంటూ సెటైర్లు వేస్తున్నారు జనాలు. ఇటీవలే సీపీఐ లీడర్ రత్నాకరన్.. ఆడంబరంగా జరిగే పెళ్లిళ్ల విషయంలో విమర్శలు గుప్పించాడు. ఇలాంటి పెళ్లిళ్లపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన నేత కూతురి పెళ్లినే అంత ఆడంబరంగా చేశారు. మొత్తం పార్టీనే జనాలు తిట్టిపోస్తుండటంతో దీనిపై ఆ పార్టీలో అంతర్గతంగా చర్చించాలని నిర్ణయించారు. ఐతే గీతా గోపి మాత్రం పెళ్లి అన్నాక ఈమాత్రం హడావుడి ఉండదా.. మహిళలకు బంగారం మీద ఆశ ఉంటుంది కదా అన్నారు. తాము పెళ్లి వేడుకను మాత్రం సింపుల్ గానే చేశామన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/