కడుపులో ఎంత ఉన్నా.. అధికారపక్షంలో ఉన్న నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయటానికి అస్సలు సాహసించరు. సొంత ప్రభుత్వంపైనా.. అధికారులపైనా తాము చేసే వ్యాఖ్యల ప్రభావం ప్రజల్లో నెగిటివ్ గా మారుతుందని ఫీలవుతుంటారు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఏపీ అధికారపక్షానికి చెందిన కొందరు నేతలు. అలాంటి వారిలో ముందుంటారు ఎంపీ కేశినేని నాని.
ఏపీ రవాణా శాఖలో అవినీతి భారీగా ఉందంటూ ఏపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. రవాణా శాఖాధికారులతో రచ్చ జరిగిన కొద్ది రోజులకే తనకున్న ట్రావెల్స్ బిజినెస్ ను మూసేసి అందరిని విస్మయానికి గురి చేశారు ఎంపీ నాని. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఏపీ రవాణా శాఖాధికారులపై మరోసారి విరుచుకుపడ్డారు. రవాణా శాఖ మొత్తం అవినీతిమయంగా మారిందన్నారు.
ఒక ఎంపీ లేఖను గౌరవించి అరుణాచల్ ప్రదేశ్ అధికారులు.. ముఖ్యమంత్రి.. కేంద్ర హోంశాఖ స్పందిస్తే.. ఏపీ రాష్ట్రంలోని అధికారులు మాత్రం అస్సలు పట్టటం లేదన్నారు. రాజకీయాల్లో ఉన్న తన మీద మచ్చ పడకూడదన్న ఉద్దేశంతోనే బస్సుల వ్యాపారాన్ని పక్కన పెట్టేసినట్లుగా కేశినేని నాని వెల్లడించారు.
అరుణాచల్ ప్రదేశ్ లో బస్సుల్ని రిజిస్ట్రేషన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతున్న వైనాన్ని గుర్తించటమే కాదు.. అలాంటి రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా రద్దు చేసిన ప్రైవేటు ట్రావెల్స్ లో ఎక్కువగా ఏపీకి చెందిన బస్సులే ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఎంపీ నాని. అధికారులతో కొందరు ట్రావెల్స్ యజమానులు కుమ్మక్కు కావటంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రూల్స్ ప్రకారం బస్సుల్ని నడుపుతున్న యజమానులంతా రవాణా శాఖ అధికారుల తీరుతో నష్టపోతున్నారని మండిపడ్డారు నాని. రవాణా శాఖ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న టీడీపీ ఎంపీ మాటల్ని వింటుంటే..ఎక్కడో ఏదో టచ్ అవుతుందంటున్నారు. సొంత పార్టీ ఎంపీ పదే పదే అధికారుల అవినీతి గురించి మాట్లాడటం ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేయదా? అన్న డౌట్‌ను వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/