దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. దినకరన్ గెలుపునకు.. చిన్నమ్మ ముఖం మీద చిరునవ్వును తెప్పించటమే కాదు.. పళని.. పన్నీర్‌లకు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చింది తెలుగోళ్లేనని చెబుతున్నారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఆర్కేనగర్ విజయం ధన విజయమే తప్పించి దినకరన్ గొప్పతనం ఏమీ లేదని తేల్చేశారు.
ఆర్కేనగర్ ఉప ఎన్నికకు ఒకరోజు ముందు అమ్మ ఆసుపత్రి వీడియో విడుదల చేయటం కూడా కారణంగా చెప్పారు.
దినకరన్ విజయం నేపథ్యంలో కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చిన్నమ్మ పార్టీ గెలుపు వెనుక అసలు కారణం ఏమిటన్నది విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన అంశాలు ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. దినకరన్ విజయానికి నటుడు విశాల్ కూడా కారణమంటున్నారు.
ప్రముఖ సినీ నటుడు విశాల్ నామినేషన్ ను రద్దు చేయించటంలో అధికార పార్టీ చేసిన ప్రయత్నం ఆర్కే నగర్ ఓటర్లకు ఒళ్లు మండేలా చేసిందట. ఇది కూడా దినకరన్ విజయానికి కారణంగా మారిందన్నారు. అభ్యర్థి విషయంలో క్యాడర్ ను అన్నాడీఎంకే సంతృప్తిపర్చకపోవటం కూడా పార్టీ ఓటమికి కారణంగా చెప్పారు.
రెండాకుల గుర్తు తమకే ఉందన్న ధీమా కూడా అన్నాడీఎంకే కొంప ముంచిందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తు కంటే కూడా డబ్బు గొప్పదన్న విషయాన్ని గుర్తించకపోవటం కూడా అధికారపార్టీ చేసిన భారీ తప్పిదంగా ఆయన అభివర్ణించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్ కూడా రాకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలిత పోటీ చేసినప్పుడే డీఎంకేకు డిపాజిట్ వచ్చిందని.. అలాంటిది దినకరన్ బరిలో ఉన్నప్పుడు ఆ పార్టీకి డిపాజిట్ రాకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం వచ్చినప్పటికీ డీఎంకే మౌనంగాఉండటం కూడా పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తిని రేకెత్తించిందని.. అన్నాడీఎంకే రెండు ముక్కలు అయినందున తాము గెలుస్తామన్న ధీమాలో ఉందన్నారు.
జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ప్రజాస్వామ్యం అన్నది లేదని.. దినకరన్ గెలుపుతో రాజకీయ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండానే కేంద్రం స్పందించి.. తమిళనాడులో ముందస్తు ఎన్నికలు నిర్వహించటం మంచిదన్న అభిప్రాయాన్ని కేతిరెడ్డి వ్యక్తం చేశారు. దినకరన్ గెలుపు ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నమ్మ విజయం ఎంతమాత్రం కాదని.. అది కేవలం డబ్బు గెలుపుగా అభివర్ణించారు. భారత రాజకీయాల్ని శాసించేది డబ్బు మాత్రమేనని.. అందుకు నిదర్శనం తాజా ఎన్నికల ఫలితంగా చెప్పారు.