ఖమ్మం జిల్లాకు చెందిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆనంద్ రెడ్డి హత్యలో చీకటి కోణం వెలుగుచూసింది. కొద్దిరోజుల క్రితం కిడ్నాప్ అయిన ఈ అధికారి కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు విస్తృతంగా గాలిస్తున్న వేళ.. అనుకోని విషాదం నెలకొంది.
ఆనంద్ రెడ్డి భూపాలపల్లి అటవీ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. తాజాగా కిడ్నాప్ కేసులో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా డెడ్ బాడీని భూపాలపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు.
హత్య చేసి చాలా రోజులు కావడం తో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. పంచానామ పోస్టుమార్టం కూడా అక్కడే చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేశారు. అటవీప్రాంతం.. చీకటి ఉండడంతో నిన్న రాత్రి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈరోజు ఉదయం పంచానామా నిర్వహించనున్నారు.
కాగా లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యలో సీఐ ప్రశాంత్ రెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆనంద్ రెడ్డిని కారులో ప్రదీప్ రెడ్డినే తీసుకెళ్లాడు. హైదరాబాద్ లో వీరిని గుర్తించారు. ఇతడే హత్య చేసి ఉంటాడని.. ఇసుక వ్యాపారంలో గొడవలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.