మాయదారి కాలం కాక మరేంటి? సెల్ కొనివ్వలేదని తల్లిని చంపేశాడు

Update: 2022-03-26 04:18 GMT
ఈ ఉదంతం గురించి విన్నంతనే మనసు చేదుగా మారిపోవటమే కాదు.. మనిషికి ఏమవుతుందన్న భయాందోళనలు కలగటం ఖాయం. మోసి కని పెంచిన కొడుకే తల్లిని పొట్టన పెట్టుకోవటం.. అది కూడా సెల్ ఫోన్ కొనివ్వలేదన్న కారణం కావటం షాకిచ్చేలా మారింది. ఈ ఉదంతం గురించి వింటే అయ్యో అనిపించటమే కాదు.. రానున్న రోజులు మరెంత గడ్డుగా ఉంటాయన్న భావన కలుగక మానదు.

ఈ దారుణ ఉదంతం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని శేరిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

గ్రామానికి చెందిన లక్ష్మీది నిరుపేద కుటుంబం. ఇంటి పెద్దాయనకు అనారోగ్యం కావటంతో ఇంటిని ఆమె కూలి పనులు చేస్తూ సాకుతోంది. పెద్ద కొడుకు మహేశ్ ఇంటర్ చదివి కూలి పనులకు వెళుతుంటాడు. ఇదిలా ఉంటే లక్ష్మీ చిన్న కొడుకు సాల్మన్ విద్యాబుద్ధులు అబ్బలేదు. స్థానికంగా తిరుగుతూ గొడవలకు వెళుతుంటాడన్న పేరుంది.

ఈ మధ్యనే అతడు స్థానికంగా కొందరితో గొడవపడటం.. ఆ సందర్భంగా వారికి సంబంధించిన కారు అద్దాల్ని పగలగొట్టి.. గాయపరిచిన కేసులో జైలుకు పంపారు. దీంతో.. తన తమ్ముడి అరెస్టుకు కారణమయ్యారంటూ ఆవేశానికి గురై.. మూడు రోజుల క్రితం రైతుల పొలాల్లో మిరపకట్టెకు నిప్పు పెట్టాడు.

ఈ క్రమంలో అతడి చేతులకు గాయాలయ్యాయి. దీంతో.. కొడుక్కి సపర్యలు చేసేందుకు వీలుగా కూలి పనులకు వెళ్లకుండా కొడుక్కి సేవలు చేస్తూ ఇంటి వద్దే ఉండిపోయాడు. ఇదిలా ఉంటే.. తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లిని అడుగుతున్నాడు. తన వద్ద డబ్బుల్లేవని సర్ది చెప్పేది. అయినప్పటికీ తాను కోరినట్లే స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటూ ముకుం పట్టు పట్టాడు.

ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాదనలు చోటుచేసుకోవటం.. ఆవేశానికి పోయిన మహేశ్.. బలమైన వస్తువుతో లక్ష్మీ తల మీద బలంగా మోదటంతో ఆమె తల పగిలింది. అపస్మాకర స్థితికి చేరుకుంది. ఆసుపత్రికి చేర్చే లోపే ప్రాణం పోయినట్లుగా వైద్యులు గుర్తించారు. నిత్యం కష్టపడుతూ కొడుకుల్నిపెంచిన తల్లికి.. సెల్ ఫోన్ కొనివ్వలేదన్న చిన్న కారణంగా హతమార్చటం చూస్తే.. ఇలాంటి కొడుకును ఏం చేయాలి? అన్నదిప్పుడు అసలు ప్రశ్న.
Tags:    

Similar News