కిమ్ ఇంతలా మారిపోతాడని అనుకోలేదు..

Update: 2018-09-19 07:35 GMT
అద్భుతం ఆవిష్కృతమైంది. ఉప్పు-నిప్పులు మరోసారి కలిశాయి. నియంతలా పాలించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒకానొక శుభ ఉదయాన ఎక్కడ జ్ఞానోదయం అయ్యిందో కానీ పూర్తిగా మారిపోయాడు. కయ్యానికి కాలు దువ్విన చేతులతోనే ప్రత్యర్థులైన దక్షిణ కొరియా - అమెరికాలకు స్నేహ హస్తాలు చాటాడు. దీంతో వైరం పోయి చెలిమి వచ్చింది. ఇదివరకే సరిహద్దుల్లో కలిసిన ఉత్తర - దక్షిణ కొరియా అధ్కక్షులు ఓసారి కలిశారు. ఆ తర్వాత కలుసుకోలేదు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కానీ ఇప్పుడు తాజాగా మరోసారి రెండు కొరియా దేశాల మధ్య శిఖరాగ్ర చర్చలు ప్రారంభమయ్యాయి.

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరకొరియాకు వెళ్లాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉత్తరకొరియాలో అడుగుపెట్టడమే కొన్నేళ్ల నుంచి జరగలేదు. కానీ ఇప్పుడు రావడంతో ఇరు కొరియా దేశాల్లో ప్రజలంతా పండుగ చేసుకున్నారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడి కోసం ఏకంగా ఉత్తర కొరియా అధ్యక్షుడే కదిలిరావడం విశేషం. విమానాశ్రయానికి వచ్చిన కిమ్.. మూన్ జెను స్వయంగా తొడ్కోని ఓపెన్ టాప్ జీప్ పై ఇద్దరూ కలిసి అధ్యక్ష భవనానికి బయలు దేరడం విశేషం. ఇద్దరికీ దారిపొడవునా జనాలు నీరాజనం పలికారు.అనంతరం నేతలిద్దరూ పార్టీ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు.

ప్రపంచ మొత్తం తమ రెండు దేశాలను గమనిస్తోందని.. ఇంతటి శాంతి, సంపదను సాధించడమేనే బృహత్తర బాధ్యత మనపై ఉందని ’ మూన్ మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఇలా దశాబ్ధాల పగ దక్షిణ కొరియా అధ్యక్షుడి పర్యటనతో ముగిసిపోవడం కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతికి బాటలు వేసింది.
Tags:    

Similar News