ఓటింగ్ పెరిగింది..మరి కిమ్ గెలుస్తాడా..

Update: 2019-03-12 17:30 GMT
అమెరికాతో సహా అగ్రరాజ్యలుగా భావిస్తున్న వారి అందరికి పక్కలో బల్లెంలా మారిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రభంజనం వీస్తోందా. మంగళవారం జరిగిన ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికలలో గతంతో పోలిస్తే 0.02 శాతం పోలింగ్ ఎక్కువ నమోదు అయ్యింది. గత ఎన్నికలలో 99.97 శాతం పోలింగ్ నమోదైతే ఈ సారి 99.99 శాతం నమోదైనట్లు ఉత్తర కొరియా మీడియ ప్రకటించింది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలు జరిగాయని విదేశాలలో ఉన్న కొరియన్లు మినహా దేశంలో ఉన్న కొరియన్లు అంత కూడా పోటింగ్ లో పాల్గున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల ప్రక్రియను చూస్తే అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీయే తిరిగి విజయం సాధిస్తుందని అంటున్నారు. ఉత్తర కొరియా పార్లమెంటుకు ఎన్నికల ప్రక్రియ గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభమయ్యింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న ఎన్నికలలో పాల్గునేందుకు అర్హత కలిగిన ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఇతర దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియాలో ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. ప్రతీ నియోజక వర్గంలోను ఒక అభ్యర్ది మాత్రమే పోటిలో ఉంటారు. ఓటర్లు వారినే ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యుల ఎన్నికకు - దేశ అధ్యక్ష పదవికి సంబంధం లేదు. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా కిమ్ జోన్ ఉంగే కొనసాగుతారు. ఇక్కడ విషాదం ఏమిటంటే ఉత్తర కొరియా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి కాని ఓటర్లు అభిప్రాయాలకు మాత్రం ఎలాంటి విలువ ఉండదు. ప్రస్తుతం ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబ పాలన సాగుతోంది. దీంతో ఆ కుటుంబం పట్ల అధ్యక్షుడి పట్ల ఉత్తర కొరియన్లు వినయ విధేయతలు కలిగి ఉండాలి.


Tags:    

Similar News