నల్లమలలో యురేనియం తవ్వకాలు.. కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన పరిణామం. దీనిపై హీరోలు పవన్, విజయ్ దేవరకొండ గళమెత్తారు. రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్ష నేతలు నిరసన తెలిపారు. సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజలు కూడా పచ్చని అడవిని కూల్చి విషతుల్యం చేసే యురేనియం తవ్వకాలు వద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే కేసీఆర్ ఈ విషయాన్ని నాన్చి నాన్చి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేసి చివర్లో హీరోల రంగ ప్రవేశం చేసి యురేనియం తవ్వకాలపై తెలంగాణలో నిషేధం విధిస్తున్నామని.. తవ్వడానికి అనుమతులు ఇవ్వమని... కేంద్రాన్ని ఎదురిస్తామని అసెంబ్లీలో ఒక్క ప్రకటన చేసి మొత్తం యురేనియం క్రెడిట్ ను కొట్టేశాడు..
అయితే యురేనియం వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన పాచిక పారింది. యురేనియం తవ్వకం, పరిశోధన కేంద్రప్రభుత్వ పరిధిలో ఉండడంతో బీజేపీ అభాసుపాలైంది. యురేనియం తవ్వకాల విషయంలో కేసీఆర్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి డిఫెన్స్ లో పడేశాడన్న చర్చ తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో సాగింది.. దీంతో బీజేపీ పెద్దలు రగిలిపోతున్నట్టు కనిపిస్తోంది.
తాజాగా యురేనియం తవ్వకాలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యురేనియం తవ్వకాలపై తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని ఆయన మండిపడ్డారు. టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యురేనియం తవ్వకాలకు అనుమతి వచ్చిందని.. 2016లో కేసీఆర్ సర్కారు కూడా అనుమతులు ఇచ్చిందని కిషన్ రెడ్డి సంచలన విషయం చెప్పారు.
దీంతో కేసీఆర్ మొదట యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చి ఇప్పుడు ప్రజాగ్రహం పెల్లుబుక్కడంతో నెపాన్ని బీజేపీపై నెట్టేశాడని అర్థమవుతోంది.. యురేనియం తవ్వకాలపై వ్యతిరేకత రావడంతో కేసీఆర్ తమను బుక్ చేశాడని ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.