ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లుని టీడీపీ మండలిలో తన కున్న బలంలో అడ్డుకోగా ...సీఎం జగన్ ఏకంగా మండలినే రద్దు చేయాలంటూ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అలాగే ఈ వ్యవహారం పై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుని ఎవరూ అడ్డుకోలేరు అంటూ చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో గత 40 రోజులకి పైగా అమరావతిలోని రాజధానిని ఏర్పాటు చేయాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతులు, రాజధాని పరిరక్షణ జేఏసీ నేతలు ఆదివారం ఢిల్లీలో కిషన్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రైతులు కిషన్ రెడ్డిని కోరారు. ఆ తరువాత ఈ విషయంపై మాట్లాడిన కిషన్ రెడ్డి ..మూడు రాజధానుల విషయం లో ఆంధ్రప్రదేశ్ సర్కారు పునరాలోచించాలని కోరారు.
అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అయినప్పటికీ కూడా.. రాజధాని మార్పు అనేది అంత మంచిది కాదని అన్నారు. ఏపీ బీజేపీ మూడు రాజధానులు వద్దని చెప్పిందని తెలిపారు. మూడు రాజధానుల పై ఇప్పటి వరకు జగన్ సర్కారు నుంచి అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కేంద్రానికి లిఖిత పూర్వకంగా సమాచారం అందిన తర్వాతే ఏపీ ప్రభుత్వం తో మాట్లాడతామని చెప్పారు. రాజ్యాంగ పరిధిలోనే కేంద్రం వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ విషయమైనా.. కొన్ని సూచనలు చేస్తామని, రైతుల గురించి కూడా ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే , ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో భూదందా చేసేందుకే అమరావతి నుంచి రాజధానిని విశాఖ కు మార్చాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. రాజధాని అంశంపై తాము మొదటి నుంచి ఒకటే వైఖరి తో ఉన్నామని.. పరిపాలన అంతా అమరావతి నుంచే జరగాలని కోరుతున్నామని కన్నా స్పష్టం చేశారు. విశాఖ లో 6వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కన్నా సంచలన వ్యాఖ్యలు చేసారు.