ఏపీలో అందరి నోటా జగన్ పేరే వినవస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పార్టీ గెలుపు ఖాయం అని ఫిక్సవడమే కాదు... మంత్రులు ఎవరు అన్న చర్చలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలు నెరపడంలో కీలక జిల్లా అయిన కృష్ణా - గుంటూరు జిల్లాలలో ఈ హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇపుడు అది సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ అవుతోంది. ముఖ్యంగా తెలుగు దేశంలో చంద్రబాబు నమ్మకంగా ఉన్నా నియోజకవర్గ స్థాయిలో టీడీపీ గెలుస్తుందని పార్టీ వర్గాలే నమ్మట్లేదు. దీంతో వైసీపీ శ్రేణులు చాలా భరోసాగా ఉన్నాయి.
వైసీపీలో చాలా మంది నేనే మంత్రి అని ఫీలవుతున్నారట. సామాజిక వర్గాల లెక్కలు - జిల్లా లెక్కలు వేసుకుని మంత్రి పదవులపై కలలు కంటున్నారట. మొన్న ఓ నాయకుడి అనుచరుడు ఏకంగా బ్యానర్ వేసి కాబోయే మంత్రి అంటూ హడావుడి చేశారు. వాస్తవానికి ఆ బ్యానర్ ఎవరి కోసం వేశారో అతను అంత పెద్ద పాపులర్ నేత కూడా కాదు.
ఈ నేపథ్యంలో ఈ ప్రచారం జగన్ కు చాలా నమ్మకమైన నేతల్లో ఒకరైన కొడాలి నాని దాకా వెళ్లింది. ఆయనను అందరూ హోం మంత్రి అంటున్నారు. దీనిపై కొడాలి నాని స్పందించారు. పార్టీ తప్పకుండా గెలుస్తుంది. నాకు మంత్రి పదవి అన్నది జగన్ నిర్ణయం. నాకు పదవి కాదు - జగన్ ముఖ్యం. పదవి ఇచ్చిన ఇవ్వకపోయినా జగన్ వెంట నడుస్తాను అంటూ వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 11న వైసీపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వైసీపీ కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేశారు. మా కష్టం ఫలిస్తుంది. పదవులు గురించి తర్వాత ముందు పార్టీ గెలుపు ముఖ్యం అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు వైసీపీలోనే ఉంటూ - జగన్ అడుగు జాడల్లో నే నడుస్తానని కొడాలి నాని విస్పష్టంగా చెప్పేశారు.