మాజీ మంత్రి కొల్లుకు.. మంత్రి కొడాలి అదిరిపోయే ఆన్స‌ర్‌!

Update: 2020-11-30 17:30 GMT
రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లు.. కామ‌న్‌. అయితే.. వైసీపీ నాయ‌కుడు, మంత్రి కొడాలి నాని స్టయిలే వేరు. ఆయ‌న చేసే విమ‌ర్శ‌లు కొంత ప‌రుషంగా ఉన్నా.. సూటిగా సుత్తిలేకుండా ఉంటాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. దీంతో ప్ర‌త్య‌ర్థి ప‌క్షానికి వాయిస్ లేకుండా పోతోంది. తాజాగా కొడాలి నాని.. త‌న మాట‌ల ధాటిని మ‌రోసారి చూపించారు. మంత్రి పేర్ని నానిపై తాపీ మేస్త్రీ టాపీతో హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి పేర్ని నాని.. తృటిలో త‌ప్పించుకున్నారు. ఇదిలావుంటే, ఈ విష‌యం రాజ‌కీయ రంగు పులుముకుంది.

దాడి చేసిన తాపీ మేస్త్రీకి టీడీపీకి సంబంధాలు ఉన్నాయ‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే .. ఈ దాడి విష‌యంపై స్పందించిన మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌.. ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``వైసీపీ నేత లపై జరుగుతున్న దాడులు చిత్రంగా ఉంటున్నాయి. గ‌తంలో కోడి క‌త్తితో దాడి జ‌రిగింది. ఇప్పుడు టాపీతో దాడి. నిజానికి ఇవేవీ మార‌ణాయుధాలు కావు. ప‌డుకుని గాఢ నిద్ర‌లో ఉన్న వ్య‌క్తిపై వీటితో దాడిచే సినా.. చ‌చ్చిపోరు. ఇవ‌న్నీ వైసీపీ ఆడుతున్న వీధి నాట‌కాలు!``- అని ఆరోపించారు. నిజానికి అస‌లే త‌న‌పై దాడి జ‌రిగి ఒకింత ఆందోళ‌న‌తో ఉన్న మంత్రి పేర్నికి ఇలాంటి వ్యాఖ్య‌లు మంట‌పుట్టించేవే. కానీ, ఆయ‌న ఏమీ అన‌కుండా మౌనంగా ఉన్నారు.

అయితే.. ఇదే విష‌యాన్ని మీడియా.. మంత్రి కొడాలి నాని వ‌ద్ద ప్ర‌స్థావించింది. మాజీ మంత్రి కొల్లు వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న‌కు వినిపించింది. దీనిపై కొడాలి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ``టీడీపీ నేత‌ల‌కు మ‌తి లేన‌ట్టుంది. మాపై జ‌రుగుతున్న దాడులు డ్రామాలంటే.. మ‌రి 2003లో చంద్ర‌బాబుపై అలిపిరి వ‌ద్ద జ‌రిగిన మావోయిస్టుల దాడిని కూడా డ్రామా అంటే.. ఒప్పుకొంటారా? సింప‌తీ కోసం.. చంద్ర‌బాబే ఆ దాడి చేయించుకున్నార‌ని అంటే.. ఏమంటారు?`` అని షాకింగ్ కామెంట్లు చేశారు. వైసీపీ నేత‌లు.. త‌మ ర‌క్ష‌ణ క‌న్నా కూడా ప్ర‌జ‌ల ప్రాణ ర‌క్ష‌ణకే ఎక్కువ‌గా విలువ ఇస్తున్నార‌ని మంత్రి నాని చెప్పారు.

దీనిపై తాము ఎక్క‌డ ఎవ‌రితో అయినా.. చ‌ర్చించేందుకు రెడీగా ఉన్నామ‌ని అన్నారు. ఇక‌, అసెంబ్లీ స‌మావేశాల గ‌డువును పెంచాలంటూ.. టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నార‌న్న వ్యాఖ్య‌ల‌పై కూడా కొడాలి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``వాళ్ల‌కంత ఇష్టంగా ఉంటే... చంద్రబాబుతోను, లోకేష్‌తోనూ జూమ్ మీటింగులు పెట్టుకోమ‌ని చెప్పండి!`` అని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News