ప్ర‌త్యేక హోదా రాద‌ని చెప్పేసిన టీడీపీ ఎంపీ

Update: 2016-10-17 10:03 GMT
అరకు పార్లమెంటు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచి టీడీపీలో చేరిన కొత్తపల్లి గీత ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లోని సింహాచలేశ్వ‌ర స్వామిని భ‌ర్త‌తో క‌లిసి దర్శనం చేసుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌పై స్పందించారు. విశాఖపట్నానికి రైల్వేజోన్ వస్తుందని గీత విశ్వాసం వ్యక్తం చేశారు. రైల్వేజోన్ ఇస్తామని కేంద్ర రైల్యే మంత్రి సురేశ్ ప్ర‌భు హామీ ఇచ్చారని, ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నార‌ని గీత వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా గీత ఏపీకి ప్ర‌త్యేక హోదాపై స్పందించారు. ఇటీవ‌ల కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం, చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌తో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానట్టేనని ఆమె చెప్పారు. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించ‌డం ఇందుకు సూచ‌న‌గా భావించ‌వ‌చ్చ‌ని విశ్లేషించారు. ప్యాకేజీ ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటే కేంద్ర నుండి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉందని గీత అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా కృషిచేస్తున్నార‌ని  ప్ర‌శంసించారు. త‌న భూ వివాదంపై న్యాయ పోరాటం కొన‌సాగిస్తున్నాన‌ని, విజ‌యం సాధిస్తాన‌నే భ‌రోసా వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News