కిమ్ ని ఎలా దోచుకున్నది చూపించబోతున్నారు!

Update: 2016-11-04 19:30 GMT
రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌ కు గతనెల మొదటివారంలో పారిస్‌ లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి పోలీసు దుస్తుల్లో చొరబడిన ఐదుగురు వ్యక్తులు మొహానికి ముసుగులేసుకుని, కిమ్‌ ను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల (6.7 మిలియన్ డాలర్లు) విలువైన నగలతో ఉడాయించారు. అయితే, ఈ ఘటనలో కిమ్‌ కు ఎలాంటి హాని జరగలేదు! అయితే ఈ విషయంపై తాజాగా కిమ్‌ తల్లి బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నారట. తన కూతురిపై కొందరు దుండగులు దాడి చేశారు.. కాళ్లు చేతులు కట్టేసి అందిన కాడికి దోచుకున్నారు.. దీంతో ఈ దోపిడీ ఘటనను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది కిమ్‌ కర్దాషియన్ తల్లి - రియాలిటీ టీవీ స్టార్ క్రిస్ జెన్నర్.

కిమ్ కర్దాషియన్‌ పై అక్టోబర్ 3న కొందరు దుండగులు పారిస్‌ హోటల్‌లో దోపిడీకి పాల్పడటం.. ఆ సమయంలో ఆమెను బాత్‌ రూంలో బంధించి నగలు - నగదు దోచుకొని వెళ్లడం.. ఈ ఘటనతో తాను తీవ్ర భయభ్రాతులకు గురయ్యానని.. రేప్ చేస్తారేమో అని భయమేసిందని.. కిమ్ వెల్లడించడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఇలా కిమ్‌ పై జరిగిన ఈ దాడికి ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారం లభించింది. ఇలా లభించిన ప్రచారంతో పాటు ఈ సంఘటనలో మంచి క్రైమ్ థ్రిల్లర్ అంశాలు ఇందులో ఉన్నాయని భావించిన క్రిస్ బిజినెస్ మైండ్ తో ఆలోచించి... దీనిని సినిమాగా తీస్తే మంచి లాభాలోస్తాయని అంచనావేసిందట. అలా ఆలోచన వచ్చిందోలేదో వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టిందట. ఈ క్రమంలో కిమ్ పాత్ర కోసం మిలా కునిస్ లేదా నటాలియా పోర్ట్‌ మెన్ అయితే బాగుంటుందని క్రిస్ ఇప్పటికే ఆలోచిస్తోందని తెలుస్తోంది. అంతేకదామరి... బిజినెస్ కు కాదేదీ అనర్హం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News