తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 'నాకు స్ఫూర్తి మా నాన్నే. ఆయనే నా నాయకుడు, హీరో. గొప్ప తండ్రి. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు' అని కేటీఆర్ బుధవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని అరుదైన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
కాగా టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం 63వ వసంతంలో అడుగుపెట్టారు. కేసీఆర్‌గా ప్రజల్లో పాపులర్ అయిన ఆయన 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా తెలంగాణ ప్రభుత్వంలో మరో కీలక వ్యక్తి హరీశ్ రావు కూడా ఇంతకుముందే కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పడంతో ప్రత్యేకమైన బహుమతి అందించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో పార్టీని గెలిపించి అది కేసీఆర్ కు పుట్టిన రోజు కానుకని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.