తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో మంత్రి కేటీఆర్ అత్యవసర సహాయం కోసం ట్వీట్ చేస్తున్న ప్రతి ఒక్కరి సహాయం చేస్తున్నారు. సార్ మేము కష్టాల్లో ఉన్నాం ఆదుకో అని, కేటీఆర్ ను కోరిన వెంటనే స్పందిస్తున్నారు. సమస్య పరిష్కారానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు అడిగిన వెంటనే సాయం చేసి ..ఆపద్బాంధవుడు అని అనిపించుకున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తూనే ..మరోవైపు ప్రజా పాలనా పై , అధికారులు , కార్మికుల భద్రత పై తగిన చర్యలు తీసుకునేలా అందరిని అప్రమత్తం చేస్తున్నారు.
అయితే , చాలా మంది ప్రజలు మంత్రిని ఫన్నీ విషయాలలో కూడా ట్యాగ్ చేస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి మంత్రి కేటీఆర్ కి ఒక పిక్ ని ట్యాగ్ చేస్తూ ..కేటీఆర్ ను ఆలా చూడలేకపోతున్నా అంటూ రాసుకొచ్చాడు. ఇంతకీ ఆ ఫొటోలోని విషయం ఏమిటంటే ..తాజాగా హైదరాబాద్ లోని సంజీవయ్య పార్కు ఎదురుగా ఉన్న డి.ఆర్.ఎఫ్ శిక్షణా కేంద్రంలో శానిటేషన్ - డిఆర్ ఎఫ్ - ఎంటమాలజీ సిబ్బందితో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. ఆ సమయంలో తీసిన ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ - కేటీఆర్ హెయిర్ తెల్లబడిపోయింది. ఆ విషయాన్ని నేను గమనించాను అని ..దీన్ని బట్టి చూస్తే మీకు వయస్సు అయిపోతుంది అని , దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసాడు. దీనిపై రిప్లై ఇచ్చిన మంత్రి కేటీఆర్ .. My real colours coming out I guess ... Thanks for the concern brother అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు.