మూడు దశాబ్దాల పాటు తెరవెనుకే ఉంటూ చక్రం తిప్పిన ఆయన తన ప్రాణ మిత్రుడి ఉన్నతి కోసం అనునిమిషం తపించారు. ఆయన విజయాల కోసం వ్యూహాలు రచించారు. అలాంటి తెరచాటు నేత ఇప్పుడు తెరపైకొస్తున్నారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణప్రతిష్ఠ చేసే పని మొదలుపెట్టారు. ఆయన ఎవరో కాదు... కొద్ది రోజులుగా రాజ్యసభలో ఏపీ కోసం రఫ్ఫాడిస్తున్న కేవీపీ రామచంద్రరావు. తెర వెనుక నేత అయిన తెరపైకి రావడం హీరో కావాలనే లక్ష్యంతోనే అని వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ముందుకుపెట్టి ఎన్నికలకు వెళ్లే సూచనలున్నాయి. కాలం కలిసొచ్చి సీట్లు సాధిస్తే సీఎంగానూ ఆయన్ను చూడొచ్చు.
వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మలా మెలిగిన కెవిపి - తన మిత్రుడి మరణం తర్వాత దాదాపు రాజకీయంగా తెరమరుగుయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ - క్రియాశీలపాత్ర లేకుండా - తన ఉనికిని మాత్రమే చాటుకునేందుకు పరిమితమయ్యారు. మరోవైపు విభజన తర్వాత జరిగిన ఎన్నికలు ఏపిలో కాంగ్రెస్ ను వెంటిలేటర్ మీద పెట్టేలా చేశాయి. ప్రజలు కాంగ్రెస్ ను ఈసడించుకుని, నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకులకు సైతం డిపాజిట్లు దక్కకుండా చేశాయి. కాంగ్రెస్ ఇక కోలుకోవడం కష్టమనే అభిప్రాయం స్థిరపడిపోయింది. ఆ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కవలసిన ప్రత్యేక హోదా అంశంలో టిడిపి-బిజెపి విఫలమవడం, కాంగ్రెస్ ను వెంటిలేటర్ నుంచి స్పెషల్ వార్డుకు తెచ్చినట్ట యింది. దానిని అందిపుచ్చుకుని రఘువీరారెడ్డి నేతృత్వంలోని పీసీసీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు మొదలుపెట్టింది. కోటి సంతకాలకు పెద్దగా స్పందన లభించకపోవడంతో నిరాశ తప్పలేదు. ఆ తర్వాత ప్రత్యేక హోదాపై బాబు-బిజెపి వైఫల్యంపై మీడియాలో చర్చ జరగడం, ఢిల్లీలో ఆందోళనలు జరగడంతో కాంగ్రెస్ మళ్లీ దానిపై దృష్టి సారించింది.
అయితే, కెవిపి తిరిగి తెరపైకి రావడంతో హోదా ఉద్యమానికి మీడియాలోను, బయట ప్రాధాన్యం ఏర్పడింది. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రూపొందించి, అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి, హోదా అంశానికి మళ్లీ జాతీయ స్థాయి ప్రచారం సాధించడంలో కెవిపి విజయం సాధించారు. ఈ చర్యలు స్పెషల్ వార్డులో ఉన్న పార్టీకి జనరల్ వార్డుకు చేరేలా చేశాయి. చిరంజీవి - కోట్ల - జెడి శీలం సహా.. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటివరకూ బయటకు రాని మాజీలందరినీ ఒకేచోట చేర్చి, వారి ద్వారా కార్యకర్తల్లో కదలిక తీసుకురావడంలో కెవిపి కృతకృత్యులయ్యారు. పార్టీని వీడకపోయినా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పెద్ద నేతలను మళ్లీ ఇన్వాల్వు చేయడంతో సోనియా వద్ద ఆయన మంచి మార్కులు కొట్టేశారు.
ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ మీడియా దృష్టి ఆకర్షించేలా కెవిపి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజ్యసభలో కూడా హోదాపై జరిగిన చర్చలో ఘాటుగా మాట్లాడారు. ఢిల్లీలో రోజుకు కొందరిని కలిసి మద్దతు కోరడం, ఏపిలో తాము సేకరించిన కోటి సంతకాల కార్యక్రమాల ముగింపు సమావేశానికి సోనియా - రాహుల్ ను పిలిపించడం వంటి చర్యలతో, ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ కూడా పోరాడుతుందన్న సంకేతాలిచ్చేందుకు, కేవీపీ చేసిన కృషి ఫలించినట్టయింది. నిజానికి పార్టీ అధినేత్రి సోని యాగాంధీ, ఇలాంటి రాష్ట్ర స్థాయి వ్యవహారాలకు హాజరయిన దాఖలాలు లేవు. అయితే ఆమె రావలసిన అవసరాన్ని వివరించడంతోపాటు, హోదాపై కాంగెస్ పార్టీ ఏపి ప్రజలకు అండగా ఉంటుందని చెప్పించడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. మరోవైపు అమరావతికి పర్యావరణ అనుమతులపైనా కెవిపి సీరియస్ గా దృష్టి సారించారు. అమరావతికి పర్యావరణ అనుమతులు ఎలా ఇస్తారంటూ, ప్రధానికి ఘాటుగా లేఖ రాయడం ద్వారా... అమరావతిపై ఆశలు పెట్టుకున్న బాబును కష్టాల్లోకి నెట్టడంతోపాటు, అమరావతికి పర్యావరణ అనుమతుల అంశంపై జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపారు. మొత్తానికి కాంగ్రెస్ లో చచ్చిపోయిన ఆశలను మళ్లీ ఆయన బతికిస్తున్నట్లుగా అనిపిస్తోంది.