లాల్ క్రిష్ణ అద్వానీ. జనసంఘ్ కాలం నాటి నేత. కాషాయం పార్టీ అన్ని అంచులను చూసిన ఏకైక నేత. అటల్ బిహారీ వాజ్ పేయ్ తో కలసి ఇటుకా ఇటుకా పేర్చి ఈ రోజు బీజేపీని ఈ స్థితికి తెచ్చిన గొప్ప నాయకుడు అద్వానీ. అద్వానీ పేరు చెబితే నిలువెత్తు విగ్రహం, గంభీరమైన రూపం గుర్తుకు వస్తుంది. అయోధ్య రధ యాత్ర కూడా ఠక్కున స్పురణకు వస్తుంది.
ఏకధాటిగా రధయాత్ర ఉత్తరాదిన చేసి బీజేపీ రాజకీయ రధానికి పరుగులు నేర్పిన వాడు అద్వానీ. అలాంటి అద్వాని బీజేపీ ఇంతటి వైభోగంలో కూడా వెనక్కే ఉండిపోయారు. ఉప ప్రధానిగానే మిగిలిపోయారు. నిజానికి వాజ్ పేయ్ తరువాత ఆయనే ప్రధాని కావాలి.
కానీ సీన్ మారింది. అద్వానీ ప్రియ శిష్యుడు నరేంద్ర మోడీ ప్రధానిగా రెండు సార్లుగా దేశాన్ని ఏలుతున్నారు. కానీ అద్వానీకి మాత్రం ఆ అదృష్ట రేఖ లేనట్లుగా ఉంది. 2014 నుంచి 2019 వరకూ ఆయన మోడీ ప్రధానమంత్రిత్వంలో సాధారణ ఎంపీగానే ఉన్నారు. ఇక 2017 రాష్ట్రపతి ఎన్నికల వేళ అద్వానీ పేరే అంతటా వినిపించించింది.
అయితే అనూహ్యంగా తెర మీదకు రాం నాధ్ కోవింద్ వచ్చారు. ఆయన దేశాధ్యక్షుడు అయ్యారు. ఇపుడు మళ్ళీ రాష్టపతి ఎన్నికలు రానున్నాయి. మరోసారి అద్వానీ పేరు తెర మీదకు వస్తోంది. అయితే అది బీజేపీ నుంచి కాదు, ఆరెస్సెస్ నుంచి. ఆరెస్సెస్ నేతలు అద్వానీని ఆ ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాలని కోరుతున్నారుట. ఒక విధంగా వత్తిడి చేస్తున్నారుట.
బీజేపీ కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన లోహ పురుషుడు అద్వానీకి ఇదే పార్టీ ఇచ్చే అత్యుత్తమ గౌరవం అని వారు బీజేపీ పెద్దలకు నచ్చచెబుతున్నారుట. మరి బీజేపీ పెద్దల మదిలో ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో గులాబ్ నబీ అజాద్ ముందు వరసలో ఉంది. ఇక వెంకయ్యనాయుడు పేరు ఉన్నా బండారు దత్తాత్రేయ కూడా రేసులోకి వస్తున్నారు.
వీరెవరూ కాకుండా అనూహ్యంగా కొత్త ముఖాలను కూడా తెర మీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఆరెస్సెస్ ఆశ కానీ అద్వానీ ఈ ఏజ్ లో రాష్ట్రపతి పదవి చేపట్టగలరా అన్నది ఒక చర్చగా ఉంది. ఆయన వయసు ఇప్పటికి 95 ఏళ్ళు. మరో అయిదేళ్ళ పాటు రాష్ట్రపతిగా ఆయన పనిచేయాలి.
బరువు బాధ్యతలతో కూడుకున్న పదవి అది. 2024లో ఎవరికీ మెజారిటీ రాకపోతే సంక్లిష్టమైన పరిస్థితి రాష్ట్రపతి భవన్ దే. ఇక అద్వానీ ఈ మధ్యనే పుట్టిన రోజు చేసుకుంటే మోడీ, అమిత్ షా సహా అంతా ఆయన నివాసానికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియచేశారు. నాడు అద్వానీ చేతిని బీజేపీ నేతలు పట్టుకుని కేక్ కట్ చేయించారు.
మరి అద్వానీ ఆరోగ్యంగానే ఉన్నా కూడా రాష్ట్రపతి పదవిని చేపట్టగలరా అన్నదే చూడాలి. ఒక వేళ ఆయన అంగీకరించి బీజేపీ పెద్దలు ఓకే చేస్తే మాత్రం దేశమంతా ఆ నిర్ణయాన్ని ఆహ్వానిస్తుంది. ఆనందిస్తుంది అని వేరేగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయన అద్వానీ కాబట్టి.